Bhatti Vikramarka: వైఎస్ ఆలోచనలకు అనుగుణంగా నడుస్తాం
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:33 PM
Telangana: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ...
హైదరాబాద్, జూలై 8: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ఆలోచనలకు అనుగుణంగా నడుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... వైఎస్‌లాగా ప్రజల కోసం పని చేస్తామని తెలిపారు. వైఎస్ ప్రజల హృదయాల్లో ఉన్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదవాళ్ళు కలలో కూడా ఊహించని విధంగా సంక్షేమాన్ని పొందారని గుర్తుచేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు.
Telangana: తెలంగాణలో కార్పొరేషన్ పదవుల పంపకం..
వారంతా కాంగ్రెస్‌లోకి రండి...
రాబోయే రెండు దశాబ్దాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం నాయకులందరం కలిసికట్టుగా ఉందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో భారీ చేరికలు జరుగుతున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తల ఎత్తుకొని తిరిగేలా చేస్తామన్నారు. కాంగ్రెస్ పాత నాయకులందరూ పార్టీలోకి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
Rahul Gandhi: వైఎస్సారే నాకు స్ఫూర్తి.. ఎంతో నేర్చుకున్నా..
రేవంత్ అద్భుతంగా పని చేస్తున్నారు: దీపాదాస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతంగా పని చేస్తున్నారని కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ కొనియాడారు. రేవంత్‌కు ప్రజల ఆశీర్వాదం ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘‘రాజశేఖర్ రెడ్డి వేసుకునే డ్రెస్ లాంటిది మా ఆయన వేసుకునేవారు’’ అని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో ఉన్నారని అన్నారు.
AP Free Sand policy: ఉచిత ఇసుక పాలసీపై విడుదల కానీ జీవో..
వైఎస్ చరిత్ర సృష్టించారు: కేవీపీ
26 ఎమ్మెల్యేల నుండి 90 ఎమ్మెల్యేలను తెచ్చింది వైఎస్ అని కాంగ్రెస్ నేత కేవీపీ పేర్కొన్నారు. పాదయాత్ర వల్ల వైఎస్ చరిత్ర సృష్టించారన్నారు. పేదల గుండెల్లో వైఎస్ చెరగని ముద్ర వేశారని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి..
Telangana: తెలంగాణలో కార్పొరేషన్ పదవుల పంపకం..
AP Politics: జగన్‌కు షర్మిల మరో బిగ్ షాక్..
Read Latest Telangana News And Telugu News