Share News

Harish Rao: హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు.. హరీష్‌రావు ధ్వజం

ABN , Publish Date - Sep 30 , 2024 | 07:02 AM

డిటోనేటర్లు పెట్టి మల్కాపూర్ చెరువులో కట్టడాలను కూల్చివేసిన అధికారులు, ఇప్పుడు హైడ్రాకి, హోంగార్డు గోపాల్ చనిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకోవడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఈ సంఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. హోంగార్డు గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్ చేశారు.

Harish Rao: హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు.. హరీష్‌రావు ధ్వజం

సంగారెడ్డి జిల్లా: హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో పనిచేసే హోంగార్డు గోపాల్ హైడ్రా వల్ల చనిపోయారని అన్నారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్ ( ట్విట్టర్)లో ఓ పోస్ట్ చేశారు. డిటోనేటర్లు పెట్టి మల్కాపూర్ చెరువులో కట్టడాలను కూల్చివేసిన అధికారులు, ఇప్పుడు హైడ్రాకి, ఆ సంఘటనకు ఎలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకోవడం సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు. ఈ సంఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. హోంగార్డు గోపాల్ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


ALSO READ: Harish Rao: హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు.. హరీష్‌రావు ధ్వజం

అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ

కూల్చివేతలు అన్నీ హైడ్రాకు ముడి పెట్టవద్దు: రంగనాధ్

సంగారెడ్డి : హైడ్రాపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తూ అప్రదిష్ఠపాలు చేయాలని ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంస్థ కమిషనర్‌ రంగనాథ్‌ హెచ్చరించారు. సంబంధం లేని విషయాలను సంస్థకు ఆపాదిస్తూ కొంతమంది ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సంగారెడ్డిలోని మల్కాపూర్‌ చెరువులో కూల్చివేతలు హైడ్రా చేపట్టలేదని స్పష్టం చేశారు. అక్కడ జరిగిన ప్రమాదంలో హోంగార్డుకు గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని, దానికి హైడ్రా బలి తీసుకుందని ప్రచారం చేస్తుండటం దురదృష్టకరమని అన్నారు. కూకట్‌పల్లిలో ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని, బుచ్చమ్మ ఆత్మహత్యను హైడ్రాకు ముడిపెట్టవద్దని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రాకు ఆపాదిస్తున్నారని, ఆదిలాబాద్‌ జిల్లాలో కూల్చివేతలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు మాత్రమే హైడ్రా పరిధిలోకి వస్తుందని రంగనాథ్‌ గుర్తుచేశారు.


బాధితుల నుంచి నిరసనలు

మరో వైపు.. మూసీ ఆక్రమణలకు మార్కింగ్‌.. ఇంకోవైపు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాల కూల్చివేత.. వాటిని వ్యతిరేకిస్తూ బాధితుల నుంచి నిరసనలు పెరిగిపోవటం, బాధితుల ఆక్రందనలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటం.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు పునరాలోచనలో పడ్డాయి. క్షేత్రస్థాయి సర్వే, మార్కింగ్‌లను రెవెన్యూ విభాగం ఇప్పటికే నిలిపివేయగా.. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోన్న ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌’ (హైడ్రా) తాత్కాలికంగా కూల్చివేతలకు విరామం ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విరామం సమయంలో ఫిర్యాదులపై సమగ్ర పరిశీలన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.


ఫిర్యాదులపై దృష్టి

ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ నోటిఫై అయిన చెరువులకు సంబంధించిన ఫిర్యాదులపై దృష్టి సారించనున్నారు. నిర్ధారిత ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అదే సమయంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, స్థానిక మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల అనుమతులున్న నిర్మాణాల కూల్చివేతల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. కాగా, హైకోర్టు కూడా పలుమార్లు హైడ్రా దూకుడును ప్రశ్నించింది. కోర్టు విచారణలో ఉన్న ఓ భవనాన్ని కూల్చివేయడంపై తీవ్రంగా స్పందించింది. స్వయంగా లేదా వర్చువల్‌గా హైడ్రా కమిషనర్‌, అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇది కూడా హైడ్రా పునరాలోచనకు ఓ కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి, జూలై 19వ తేదీన ఏర్పాటైన హైడ్రా తొలి నుంచి దూకుడుగానే ఉంది. చెరువులు, పార్కుల్లోని నివాసేతర నిర్మాణాల కూల్చివేత చేపట్టగా మొదట్లో ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి

Harish Rao: 1962 సేవల పట్ల సర్కార్ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి ఫైర్

ED: ఈడీ అదుపులో సాహితీ ఇన్ఫ్రా ఎండీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2024 | 10:42 AM