Share News

Harish Rao: వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి

ABN , Publish Date - Sep 02 , 2024 | 05:55 PM

ప్రజలు కష్టాల్లో ఉన్నారు సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‎రావు అన్నారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఎడతెగని కన్నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Harish Rao: వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి

హైదరాబాద్: ప్రజలు కష్టాల్లో ఉన్నారు సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‎రావు అన్నారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఎడతెగని కన్నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని వాపోయారు. ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు, కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడంపై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలని కోరారు.


ఇప్పటికే తక్షణ సహాయ చర్యలు అందలేదని జనం తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈరోజు(సోమవారం) తెలంగాణ భవన్‎లో హరీష్‎రావు మీడియాతో మాట్లాడుతూ.... తెలంగాణ ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసుపెట్టి చర్యలు తీసుకోవాలని.. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాను పునర్దరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు.


ఆహారం, నీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. అసలే రాష్ట్రం విష జ్వరాలతో విలువిలలాడుతోందన్నారు. వరదల వల్ల మరింత విజృంబిచే ప్రమాదం ఉందని చెప్పారు. అన్ని శాఖలు అప్రమత్తం కావాలని అన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. ఎకరానికి పరూ. 10 వేల నష్టపరిహారం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Updated Date - Sep 02 , 2024 | 05:56 PM