Share News

Kothakota Srinivas: ఫోన్‌ ట్యాపింగ్‌పై హైదరాబాద్ సీపీ తొలి రియాక్షన్...

ABN , Publish Date - Apr 11 , 2024 | 12:48 PM

Telangana: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. రాజకీయ నేతల ఫోన్‌లను ట్యాపింగ్ చేశారనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఆనాటి పోలీసు ఉన్నతధికారులు అరెస్ట్ అవగా.. వారి రిమాండ్ రిపోర్ట్‌లో అనేక కీలక విషయలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పారదర్శకంగా విచారణ కొనసాగుతోందన్నారు.

Kothakota Srinivas: ఫోన్‌ ట్యాపింగ్‌పై హైదరాబాద్ సీపీ తొలి రియాక్షన్...

హైదారాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారం ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. రాజకీయ నేతల ఫోన్‌లను ట్యాపింగ్ చేశారనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఆనాటి పోలీసు ఉన్నతధికారులు అరెస్ట్ అవగా.. వారి రిమాండ్ రిపోర్ట్‌లో అనేక కీలక విషయలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kothakota Srinivas Reddy) మొదటిసారి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పారదర్శకంగా విచారణ కొనసాగుతోందన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. పొలిటికల్ లీడర్ల నోటీసులపై త్వరలో వెల్లడిస్తామని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

AP Elections: బరితెగించిన వైసీపీ నేతలు.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు!


ఫోన్‌ ట్యాపింగ్‌లో ఎన్నో మలుపులు...

కాగా.. గత నెల రోజులుగా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్‌లు ట్యాపింగ్ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చట్టవిరుద్ధంగా ఫోన్‌లను ట్యాప్ చేయడం, కంప్యూటర్ సిస్టమ్‌లు, అధికారిక డేటాను ధ్వంసం చేయడం వంటి ఆరోపణలతో గత నెలలో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు (Former DSP Praneeth Rao) అరెస్ట్‌తో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రణీత్‌ రావు విచారణ సమయంలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు.

High Court:11 జిల్లాల్లో రామనవమి యాత్రను అనుమతించం..


మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ప్రభాకర్ రావు (Former Intelligence Chief Prabhakar Rao), టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు (Former Task Force DCP Radhakishan Rao) ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు విచారణలో తేలింది. అందులో భాగంగానే టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావుతో పాటు మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌‌రెడ్డితో పాటు, ఇతర కాంగ్రెస్ నాయకులు, రియాల్టర్లు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు బయటపడింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ప్రభాకర్ రావును చేర్చారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు క్యాన్సర్ చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లారు. ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.


ఇవి కూడా చదవండి..

Komatireddy Venkatareddy: రేవంత్ సీఎం పదవిపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 11 , 2024 | 02:02 PM