Share News

CM Revanth Reddy: యూనివర్సిటీల గౌరవాన్ని పెంచాలి.. వైస్ ఛాన్స్‌లర్లకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 02 , 2024 | 01:40 PM

యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని సూచించారు. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

CM Revanth Reddy: యూనివర్సిటీల గౌరవాన్ని పెంచాలి.. వైస్ ఛాన్స్‌లర్లకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

హైదరాబాద్: యూనివర్సిటీలపైన నమ్మకం కలిగించేలా పని చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డితో యూనివర్సిటీల నూతన వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో ఇవాళ(శనివారం) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్‌లర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. కొంత కాలంగా యూనివర్సిటీలపైన నమ్మకం తగ్గుతోందని..యూనివర్సిటీల గౌరవాన్ని పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని సూచించారు. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకుని నివేదిక తయారు చేసుకోవాలని కోరారు. వైస్ ఛాన్స్‌లర్లకు ఎవరి ప్రభావితంతో పోస్ట్‌లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగా వైస్ ఛాన్స్‌లర్లను ఎంపిక చేశామని గుర్తుచేశారు. బాగా పని చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.


తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంచిగా పని చేయడానికి వైస్ ఛాన్స్‌లర్లకు స్వేచ్ఛ ఉంటుందని... ప్రభుత్వ సహకారం ఉంటుందని మాటిచ్చారు. యూనివర్సిటీలను వందశాతం ప్రక్షాళన చేయాలని అన్నారు. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్లను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవారని..ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. యూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలని అన్నారు. విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలని వైస్ ఛాన్స్‌లర్లకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.


ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష

seethakka.jpg

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై డీఆర్డీఏలతో సచివాలయంలో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే ఐదు మాసాల్లో చేయాల్సిన పనులపై సమీక్షించారు. నిర్దేశించుకున్న గడువు లోపు పనులు పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి లోపు ఉపాధి హామీ పనుల కోసం రూ. 1372 కోట్ల నిధులు విడుదల చేసినట్లు మంత్రి సీతక్క ప్రకటించారు.


ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులపై మంత్రి సీతక్క మార్గ నిర్దేశం చేశారు. మ‌హిళ‌ల‌కు ఉపాధి భ‌రోసా, పంట‌ పొలాల‌కు బాట‌లు, పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్వచ్చ భారత్ మిషన్ కోసం ఉపాధి నిధులు వెచ్చించేలా క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Hyderabad: బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..

CM Revanth: ‘ప్రియమైన మోదీ జీ’.. ఎక్స్‌లో సీఎం రేవంత్ సంచలన పోస్ట్

Read Latest TELANGANA NEWS And Telugu News

Updated Date - Nov 02 , 2024 | 01:46 PM