Share News

Jupalli: అది గ్యాస్, ట్రాష్ కాదా?.. కేసీఆర్‌కు మంత్రి జూపల్లి సూటి ప్రశ్న

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:05 PM

Telangana: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ట్రాస్.. గ్యాస్ అని ఈస్ట్‌మన్‌ కలర్‌ మాదిరిగా చెప్పారని.. ఓ కథ చెప్పినట్లు ఉందంటూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... 2023లో రెండు లక్షల తొంభై వేల కోట్లు ఖర్చు చేసినట్టు కేసీఆర్ ప్రజలకు చూపించారని.. ఆదాయాన్ని ఎక్కువగా చూపించి ప్రజలను మోసం...

Jupalli: అది గ్యాస్, ట్రాష్ కాదా?.. కేసీఆర్‌కు మంత్రి జూపల్లి సూటి ప్రశ్న
Minister Jupalli Krishna Rao

హైదరాబాద్, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ట్రాస్.. గ్యాస్ అని.. ఈస్ట్‌మన్‌ కలర్‌ మాదిరిగా చెప్పారని.. ఓ కథ చెప్పినట్లు ఉందంటూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (BRS Chief KCR) చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... 2023లో రెండు లక్షల తొంభై వేల కోట్లు ఖర్చు చేసినట్టు కేసీఆర్ ప్రజలకు చూపించారని.. ఆదాయాన్ని ఎక్కువగా చూపించి ప్రజలను మోసం చేసినప్పుడు.. అది గ్యాస్, ట్రాష్ కాదా? అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ బడ్జెట్‌లో 25 శాతం వ్యవసాయానికి ఖర్చుపెడితే.. 15 శాతం గత ప్రభుత్వం అప్పులు తీర్చడంలోనే సరిపోతుందని తెలిపారు.

Volunteer System: అసెంబ్లీ వేదికగా వలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా కీలక ప్రకటన


కేసీఆర్ అమల్లోకి తెచ్చిన రైతు బంధుని రైతు భరోసాగా మార్చి కొనసాగించామన్నారు. రైతు పండించిన ధాన్యానికి అదనంగా 500 రూపాయిలు బోనస్ ఇచ్చామన్నారు. ఏడు నెలలకే తాము 30,000 కోట్ల అప్పు తెచ్చామని కేసీఆర్ మాట్లాడుతున్నారని.. తాము తెచ్చిన అప్పు బీఆర్ఎస్ చేసిన అప్పులు తీర్చడానికే సరిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘అసెంబ్లీకి కేసీఆర్ ఇన్నిరోజులు ఎందుకు రాలేదు? అంత గర్వమా? కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డిది చిన్న వయసు కాబట్టి ఆయన ముందు అసెంబ్లీలో కూర్చోవడానికి కేసీఆర్‌కు చిన్న చూపా?’’ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆరు గ్యారంటీలు కూడా ఒక్కొక్కొటిగా అమలు చేస్తున్నప్పటికీ కేసీఆర్ తమపై విమర్శలు చేస్తూన్నారని మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Jagan - INDIA Alliance: ఇండియా కూటమిలోకి జగన్..?


మరోవైపు కేసీఆర్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో వర్షాలు వస్తే కేసీఆర్ హయాంలో ఫామ్ హౌస్‌లో కూర్చొని మొసలి కన్నీరు పెట్టారని జగ్గారెడ్డి విమర్శించారు. పిట్ట కథలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అంటూ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి దగ్గరలో నిన్నటి బడ్జెట్ ఉందన్నారు. కేసీఆర్ హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తా, మూసి నదిలో ఈతకొట్టేలా చేస్తా అని గప్పాలు కొట్టిండు అని అన్నారు. ఓల్డ్ సిటీ లో మౌలిక వసతులు లేవని తెలిపారు. మెట్రో విస్తరణకు నిధులు ఇచ్చారన్నారు. రూరల్ ప్రాంతంతో పాటు రాజధాని హైదరాబాద్ కోసం భారీగా నిధులు కేటాయించారని చెప్పారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ చదువుతుంటే కేసీఆర్ బయటికొచ్చి విమర్శలు చేశారని జగ్గారెడ్డి మండిపడ్డారు.


మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్‌ను ప్రజలు చీల్చి చండాడితేనే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవక ఏడు సీట్లలో డిపాజిట్ కోల్పోయారని వ్యాఖ్యలు చేశారు. ‘‘నీ స్థానంలో ఎవరున్నా రాజకీయాలు బంద్ చేసుకొని శాశ్వతంగా రాజకీయాలు విరమించుకోవాలి. ఎనిమిది నెలలు ఇంట్లో ఉండి మధ్యలో రెండుసార్లు అసెంబ్లీ నడిచినా రాలేదు’’ అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ రంగానికి 72 వేల కోట్లు కాంగ్రెస్ కేటాయించిందని చెప్పుకొచ్చారు. ‘‘నువ్వు ఏనాడైనా పెట్టావా కేసీఆర్’’ అంటూ ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం చేసేలా కేంద్రం ఘోరంగా బడ్జెట్ పెడితే ఎందుకు కేసీఆర్ మాట్లాడలేదని మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు.


ఇవి కూడా చదవండి...

Komatireddy: ప్రజలే బీఆర్‌ఎస్‌ను చీల్చిచెండాడారు...

CM Chadrababu: దమ్ముంటే అసెంబ్లీకి రా.. జగన్‌కు చంద్రబాబు సవాల్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 26 , 2024 | 04:09 PM