Share News

Talasani: సికింద్రాబాద్‌లో తలసాని పర్యటన.. బోనాల ఏర్పాట్లపై ఏమన్నారంటే?

ABN , Publish Date - Jul 13 , 2024 | 01:19 PM

Telangana: భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అయ్యింది. ఇప్పటికే గోల్కొండ అమ్మవారికి బోనమెత్తడంతో ఉత్సవాలు మొదలయ్యాయి. అలాగే ఈనెల 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్‌లో పర్యటించారు.

Talasani: సికింద్రాబాద్‌లో తలసాని పర్యటన.. బోనాల ఏర్పాట్లపై ఏమన్నారంటే?
MLA Talasani Srinivas Yadav

హైదరాబాద్, జూలై 13: భాగ్యనగరంలో బోనాల (Bonalu Festival) సందడి షురూ అయ్యింది. గోల్కొండ అమ్మవారికి బోనమెత్తడంతో ఉత్సవాలు మొదలయ్యాయి. అలాగే ఈనెల 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు (Secundrabad Mahankali Bonalu Jatara) జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani Srinivas Yadav) శనివారం సికింద్రాబాద్‌లో పర్యటించారు. మహాంకాళి ఆలయం వద్ద అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.

Viral News: తీరిన 15 ఏళ్ల కల.. విగ్రహంతో పెళ్లి.. కారణం ఇదే!


అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 21 సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి బోనాలు, 22న రంగం (భవిష్యవాణి) జరుగనుందని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలు ఉత్సవాలను రాష్ట్ర పండుగగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందన్నారు. అందరి భాగస్వామ్యంతో అత్యంత ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్ గూటికి గాంధీ

NV Ramana: చంద్రబాబు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం శుభపరిణామం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 13 , 2024 | 01:24 PM