Share News

Vemula Prashant Reddy: తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టిన సీఎం రేవంత్.. బీఆర్ఎస్ నేత విసుర్లు

ABN , Publish Date - Sep 16 , 2024 | 04:12 PM

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ బాసులకు ప్రసన్నం చేసుకోవడానికి.. తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ విగ్రహాన్ని పెట్టడం అంటే తెలంగాణ తల్లిని అవమానించడమేనని అన్నారు.

 Vemula Prashant Reddy: తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టిన సీఎం రేవంత్.. బీఆర్ఎస్ నేత విసుర్లు
Vemula Prashanth Reddy

హైదరాబాద్: తెలంగాణకు సంబంధం లేని దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయం ఎదుట పెట్టడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) విమర్శలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ విగ్రహాన్నిపెట్టడం అంటే తెలంగాణ తల్లిని అవమానించడమేనని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.


ALSO READ: Jani Master: జానీ మాస్టర్‌పై కేసులో కీలక విషయాలు వెలుగులోకి

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ బాసులకు ప్రసన్నం చేసుకోవడానికి.. తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారని ఆరోపించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆనాడే సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని భావించారని అన్నారు. 2023 జూన్‌లో అందుకు సంబంధించిన ప్రణాళికలను సైతం సిద్ధం చేశారని గుర్తుచేశారు. సచివాలయానికి, అమరజ్యోతి మధ్య అనుసంధానంగా ఉండేలా కేసీఆర్ చేశారని చెప్పారు. కానీ రేవంత్ చర్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. డైవర్ట్ పాలిటిక్స్‌లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇలాంటి పనులు చేస్తున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేశారు.


ALSO READ: Ponnam Prabhakar: గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి

రేవంత్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి గౌరవం పెంచేలా తమ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అమరజ్యోతి కట్టి ఏడాది దాటినా రేవంత్ దాన్ని ఇంకా అందుబాటులోకి తీసుకు రావడం లేదని అన్నారు. కేసీఆర్ కట్టిన సచివాలయంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు కూర్చుంటున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు.


ALSO READ: Bandi Sanjay: విమోచన దినోత్సవం అనేందుకు కాంగ్రెస్ జంకుతుంది

కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో రివ్యూలు చేస్తున్నారని అన్నారు. కానీ కేసీఆర్ కట్టారన్న కారణంతో అమరజ్యోతిని సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ అమరులను అగౌరవ పరచవద్దని వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి ఏడాది అవుతున్న ఇంకా లోపలకు సందర్శకులను ఎందుకు అనుమతించడం లేదని నిలదీశారు. కేసీఆర్ కట్టినందుకే అనుమతించడం లేదా అని అడిగారు. కేసీఆర్ ఆనవాళ్లు ఎవరు చెరిపేయలేరని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

TG Politics: తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త చీఫ్ ముందున్న అతిపెద్ద సవాల్.. గెలిస్తే తిరుగుండదు..

Kaushik Reddy: రేవంత్ రెడ్డి.. నీ గుండెల్లో నిద్రపోతా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

KTR: తెలంగాణ తల్లిని అవమానిస్తారా?.. ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం

TG News: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా?.. ఆత్మహత్యా?

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 16 , 2024 | 04:26 PM