Share News

TG Politics: వారిద్దరూ లేకపోతే ఎన్డీఏ కూటమి గందరగోళంలో.. కడియం శ్రీహరి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jun 09 , 2024 | 06:40 PM

కేంద్రంలో బీజీపీ పార్టీకి అనుకున్న విధంగా ఫలితాలు రాకపోవడంతో ఆ పార్టీ కీలక నేతలు ఆందోళనలో ఉన్నారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari) అన్నారు. ఇప్పటికైనా బీజీపీ నాయకులు ఎగిరెగిరి పడటం మానుకొని దేశం, రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం తగ్గిందన్నారు.

TG Politics: వారిద్దరూ లేకపోతే ఎన్డీఏ కూటమి గందరగోళంలో.. కడియం శ్రీహరి షాకింగ్ కామెంట్స్
Kadiam Srihari

జనగామ: కేంద్రంలో బీజీపీ పార్టీకి అనుకున్న విధంగా ఫలితాలు రాకపోవడంతో ఆ పార్టీ కీలక నేతలు ఆందోళనలో ఉన్నారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari) అన్నారు. ఇప్పటికైనా బీజీపీ నాయకులు ఎగిరెగిరి పడటం మానుకొని దేశం, రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. ఇండియా కూటమి ఓటింగ్ 7 శాతం పెరిగిందని చెప్పారు. బీజీపీ ఓటింగ్ శాతం తగ్గడంతో మోదీ, అమిత్ షా లో భయం మొదలైందన్నారు. రామ మందిరం కట్టిన ఫైజాబాద్‌లో కూడా బీజీపీ అభ్యర్థి గెలవడం రాముడికి ఇష్టం లేదని చెప్పారు. ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు, నితీష్ కుమార్ వైదొలిగితే ఆ ప్రభుత్వమే గందరగోళంలో పడుతుందని హెచ్చరించారు.


నేడు(ఆదివారం) జనగామ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. స్టేషన్ ఘనపూర్ ప్రజలు తన పార్టీ మార్పును కూడా స్వాగతించారని చెప్పారు. 56 వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యాకు ఇచ్చారని ఉద్ఘాటించారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరిగిందని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తాను రావడంతో ప్రజల తీర్పు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందానని అన్నారు. అనేక మంది వారి స్థాయిని మరిచి తనపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు.


ప్రజల చేతిలో ప్రజాస్వామ్యం భద్రంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజల గుండెల్లో పదిలంగా ఉందని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఊహించిందే, కానీ నాయకుల మైండ్ సెట్ ఇంకా మారట్లేదని విమర్శించారు. ప్రధాన మంత్రి అవుతానని చెప్పిన కేసీఆర్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ మున్ముందు ఉంటుందో, లేదో కూడా తెలియదని పరిస్థితి ఉందని సెటైర్లు గుప్పించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని కడియం శ్రీహరి విమర్శలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Bandi Sanjay: ఆర్ఎస్ఎస్ నుంచి.. కేంద్ర మంత్రి వరకు.. 'బండి' ప్రయాణం సాగిందిలా

Etela Rajender: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా ఈటల!?

Ponguleti: అర్హులైన పేదలకు పెన్షన్ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి

TG Politics: రేవంత్ ఆ డబ్బులు ఇవ్వాలి లేకపోతే.. హరీశ్ మాస్ వార్నింగ్

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 09 , 2024 | 06:51 PM