Legal Notice: హుజురాబాద్ ఎమ్మెల్యేకు నోటీసులు.. ఎందుకంటే..?
ABN , Publish Date - Jun 23 , 2024 | 10:32 AM
రామగుండం ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ తరలింపులో అక్రమాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. లారీల నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కమిషన్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్‌గా తీసుకున్నారు. నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తన లాయర్ ఈటోరు పూర్ణచందర్ రావు తరఫున లీగల్ నోటీసులు పంపించారు.
హైదరాబాద్: రామగుండం ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ తరలింపులో అక్రమాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. లారీల నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కమిషన్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్‌గా తీసుకున్నారు. నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తన లాయర్ ఈటోరు పూర్ణచందర్ రావు తరఫున లీగల్ నోటీసులు పంపించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితోపాటు ఆ వార్త ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానెల్‌కు నోటీసులు అందజేశారు. నమస్తే తెలంగాణ దిన పత్రిక చీఫ్ ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి , తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లీగల్ నోటీసులు ఇచ్చారు.
‘ఫ్లై యాష్ ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అవుతుంది. వినియోగించుకోవడానికి వీలుండదు. టెండర్ల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తారు. రోడ్ల నిర్మాణాం, బ్రిక్స్ తయారీకి ఫ్లై యాష్ ఉపయోగిస్తారు. రామగుండం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తుంది. లారీలలో ఎంత ఫ్లై యష్ వెళ్తుందనే అంశాన్ని ఎన్టీపీసీ చూసుకుంటుంది. ఫ్లై యాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ అడగాలి. ఆ లారీలను కౌశిక్ హుజురాబాద్‌లో ఆపి మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఆరోపణలు చేయడం సరికాదు. ఆ లారీలు ఓవర్ లోడ్‌తో వెళ్తున్నాయని, ప్రతి లారీకి డబ్బులు తీసుకుంటూ పంపిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేశారు. రోజుకు వేల మెట్రిక్ టన్నుల ఫ్లై యాష్ వెళ్తుంటుంది. వ్యక్తిగత కక్షతో.. రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లీగల్ నోటిసులు ఇచ్చాం. అది ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానెల్, నమస్తే తెలంగాణ దిన పత్రికకు లీగల్ నోటిసులు పంపించాం అని’ అడ్వకేట్ ఈటోరు పూర్ణచందర్ రావు స్పష్టం చేశారు.