Students: నీట్ మళ్లీ నిర్వహించాల్సిందే..
ABN , Publish Date - Jun 22 , 2024 | 04:44 AM
నీట్, నెట్ ప్రశ్నపత్రాలు లీక్ కావడంపై విద్యార్థి, యువజన సంఘాలు మండిపడ్డాయి. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలు, యూనివర్సిటీల్లో ఆందోళనలు నిర్వహించాయి. నీట్ పరీక్షను రద్దు చేసి.. తిరిగి నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి.
హైదరాబాద్‌లో విద్యార్థి సంఘాల ఆందోళనలు.. సుప్రీం జడ్జి లేదా సీబీఐతో విచారణకు డిమాండ్
ఎన్టీఏను రద్దు చేయాలి: బల్మూరి
కిషన్‌రెడ్డి ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం
బర్కత్‌పుర/తార్నాక/రాయదుర్గం/హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): నీట్, నెట్ ప్రశ్నపత్రాలు లీక్ కావడంపై విద్యార్థి, యువజన సంఘాలు మండిపడ్డాయి. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలు, యూనివర్సిటీల్లో ఆందోళనలు నిర్వహించాయి. నీట్ పరీక్షను రద్దు చేసి.. తిరిగి నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. నీట్, నెట్ పరీక్షల అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరాయి. నీట్, నెట్ పరీక్షల్లో అవకతవకలు జరగడాన్ని నిరసిస్తూ ఓయూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఇందులో ఎన్‌ఎ్‌సయూఐ, ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎఫ్, పీడీఎ్‌సయూ, వీజేఎస్, ఏపీఎ్‌సయూ, డివైఎ్‌ఫఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, వైజేఎస్, యువజన కాంగ్రెస్ విద్యార్థి సంఘా ల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. నేషనల్ టెస్టింగ్ ఏజె న్సీ (ఎన్టీఏ)ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ అక్రమాలపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సమా ధానం చెప్పాలన్నారు. నీట్ అవకతవకలపై కేంద్రం స్పందించేలా ఒత్తిడి తేవాలని కిషన్ రెడ్డిని అపాయింట్‌మెంట్ కోరగా ఆయన ఇప్పటివరకు స్పందించలేదన్నారు. కిషన్‌రెడ్డి తీరు కు నిరసనగా శనివారం ఓయూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆయన క్యాంపు ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టి.నాగరాజు, నెల్లి సత్య, నాగేశ్వర్‌రావు, మహేశ్, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం..
నీట్ అక్రమాలకు నిరసనగా శుక్రవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బర్కత్‌పుర యువతి మండలి చౌరస్తా నుంచి కిషన్‌రెడ్డి ఇంటి వైపు కార్యకర్తలు ర్యాలీగా వస్తుండగా వారిని నిలువరించారు. దీంతో వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే యూత్ కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మోతె రోహిత్‌తో పాటు పలువురిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడు తూ.. నీట్ పరీక్షను రద్దు చేసి ప్రధాని మోదీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
హెచ్‌సీయూలోనూ..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద పలు విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. ఎన్టీఏను రద్దు చేయాలని వర్సిటీ మెయిన్ గే టు ఎదురుగా సంఘాల నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి, యూజీసీ చైర్మన్, ఎన్‌టీఏ డైరెక్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, బహుజన స్టూడెం ట్స్ ఫ్రంట్, ట్రైబల్ స్టూడెంట్స్ ఫ్రంట్, దళిత్ స్టూడెంట్స్ యూనియన్ తదితర సంఘాల నేతలు ఆందోళనలో పాల్గొన్నారు.
ఓయూలో ఎన్టీఏ దిష్టిబొమ్మ దహనం
నీట్, నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఎన్టీఏ దిష్టిబొమ్మను సంఘం నేతలు జీవన్, పృథ్వీతేజ, శ్రీహరి తదితరులు దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్టీఏను పూర్తిగా ప్రక్షాళన చేసి బాధ్యులైనటువంటి అధికారులను వెంటనే తొలగించాలన్నారు.