Share News

Daggubati Purandeswari: విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Jan 10 , 2025 | 01:22 PM

Daggubati Purandeswari: విద్యార్థులకు సమగ్రమంతమైన, వికాసవంతమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. సమాజ పరిస్థితులను తెలుసుకునే విధంగా విద్యాబోధన ఉండాలని చెప్పారు. చదువు అంటే పాఠ్యపుస్తకాలు, తరగతి గదులు , ర్యాంక్స్ మెడల్స్‌కే పరిమితం కాకూడదని పురందరేశ్వరి తెలిపారు.

Daggubati Purandeswari: విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలి
Daggubati Purandeswari

పశ్చిమగోదావరి: చదువుతోపాటు విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. నర్సాపురం వై ఎన్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలు ఇవాళ(శుక్రవారం) జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా పురందరేశ్వరి హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో సరస్వతి దేవి విగ్రహం ఆవిష్కరణ గావించారు. భోగి మంటలు వెలిగించి విద్యార్థులతో సంక్రాంతి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పురందరేశ్వరి మాట్లాడుతూ.. విద్యార్థులకు సమగ్రమంతమైన, వికాసవంతమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని అన్నారు. సమాజ పరిస్థితులను తెలుసుకునే విధంగా విద్యాబోధన ఉండాలని చెప్పారు. చదువు అంటే పాఠ్యపుస్తకాలు, తరగతి గదులు , ర్యాంక్స్ మెడల్స్‌కే పరిమితం కాకూడదని తెలిపారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలను దూరం చేసే శక్తి చదువుకే ఉందని దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 01:23 PM