Viral Video: ఈ మొసలి ఎర మామూలుగా లేదుగా.. మనుషులను ఎలా నమ్మిస్తోందో చూడండి..
ABN , Publish Date - Jan 10 , 2025 | 01:12 PM
అడవి జంతువులు వేటాడే సమయంలో అతి తెలివిగా వ్యవహరించడం చూస్తుంటాం. పులులు, సింహాలు తదితర క్రూర మృగాలు వేటాడే సమయంలో అనేక రకాల ప్లాన్‌లు వేస్తుంటాయి. గడ్డిలో నక్కి నక్కి వేటాడితే.. మరికొన్నిసార్లు మెల్లగా దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా వేటపై పంజా విసురుతుంటాయి. ఇలాంటి..
అడవి జంతువులు వేటాడే సమయంలో అతి తెలివిగా వ్యవహరించడం చూస్తుంటాం. పులులు, సింహాలు తదితర క్రూర మృగాలు వేటాడే సమయంలో అనేక రకాల ప్లాన్‌లు వేస్తుంటాయి. గడ్డిలో నక్కి నక్కి వేటాడితే.. మరికొన్నిసార్లు మెల్లగా దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా వేటపై పంజా విసురుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా, వైరల్ అవుతున్న మొసలి వీడియో చూసి అంతా అవాక్కతున్నారు. నీటిలో చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ మనుషులను మాయ చేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ మొసలి ఎర మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఇండోనేషియాలో (Indonesia) చోటు చేసుకుంది. ఓ మొసలి (crocodile) నీటిలో చేసిన విన్యాసాలు చూసి అంతా అవాక్కవుతున్నారు. వేట కోసం ఎర వేసిన చందంగా ఆ మొసలి నీటిలో మునిగింది. ఆ తర్వాత తన ముందు కాళ్లను నీటిపై ఉంచింది.
Viral Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే సీన్.. ఇందులో తప్పెవరిదో మీరే చెప్పండి..
మనుషులు నీటిలో మునిగిపోయే సమయంలో ఎలాగైతే చేతులను ఊపుతారో.. అచ్చం అలాగే ఈ మొసలి కూడా తన పంజాలను నీటిపై నుంచి అటూ, ఇటూ కదిలిస్తోంది. దూరం నుంచి ఈ సీన్ చూస్తే అచ్చం మనుషులు నీటిలో మునిగిపోతున్నట్లుగానే ఉంది. ఇది చూసి ఎవరైనా నీటిలోకి దూకి కాపాడాలని దగ్గరికి వెళ్తే.. ఆ మొసలికి ఆహారమైపోవాల్సిందే. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఇండోనేషియాలో మొసళ్లు మనుషులను చంపడానికి.. ఇలా నీటిలో మునిగిపోతున్నట్లు నటించడం నేర్చుకున్నాయి’’... అని ప్రస్తావిస్తూ ఈ వీడియోను షేర్ చేశారు.
Viral Video: గాలిలోకి ఎగిరాడు.. గాడిదపై పడ్డాడు.. ఇతడి విన్యాసం మామూలుగా లేదుగా..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ మొసలి యాక్టింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అచ్చం మనుషులు మునిగిపోతున్నట్లుగానే ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.79 లక్షలకు పైగా లైక్‌లు, 18.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో.. ఏందిరయ్యా ఇదీ.. లోకల్ ట్రైన్ ఇలా ఎక్కడం ఎక్కడైనా చూశారా..
ఇవి కూడా చదవండి..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..