Viral: వామ్మో.. ఎంతకు తెగించార్రా బాబోయ్.. ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి బ్యాగులో షాకింగ్ సీన్..
ABN , Publish Date - Jan 10 , 2025 | 11:35 AM
కొందరు అక్రమార్కులు బస్సు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను అక్రమరవాణాకు అడ్డగా మార్చుకుంటున్నారు. నిషేధిత వస్తువులతో పాటూ ఏకంగా ప్రాణంతో ఉన్న జీవులను కూడా దేశ విదేశాలను దాటిస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా..
కొందరు అక్రమార్కులు బస్సు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను అక్రమరవాణాకు అడ్డగా మార్చుకుంటున్నారు. నిషేధిత వస్తువులతో పాటూ ఏకంగా ప్రాణంతో ఉన్న జీవులను కూడా దేశ విదేశాలను దాటిస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుడిపై అనుమానం వచ్చి లగేజీని తనిఖీ చేయడగా చివరకు షాకింగ్ దృశ్యం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. కెనడాకు చెందిన ఓ వ్యక్తి (Canadian man) టొరంటో వెళ్లేందుకు జనవరి 6న ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు (Delhi Airport) చేరుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఇక్కడే ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టెర్మినల్-3 వద్ద సదరు ప్రయాణికుడిపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో అతడి లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు బ్యాగులో పరిశీలించగా (Crocodile head in a bag) మొసలి తల కనిపించింది.
Viral Video: వామ్మో.. ఏందిరయ్యా ఇదీ.. లోకల్ ట్రైన్ ఇలా ఎక్కడం ఎక్కడైనా చూశారా..
బ్యాగులో మొసలి తలను చూడగానే పోలీసులతో పాటూ అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. 777 గ్రాములున్న మొసలి తలను ఎవరికీ అనుమానం రాకుండా గుడ్డలో చుట్టి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తల మొసలి పిల్లకు చెందినది తేలింది. మరింత సమాచారం కోసం మొసలి తలను డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Viral Video: కారులో వచ్చి గుడ్లు ఎత్తుకెళ్లారు.. మరుసటి రోజు షాకింగ్ ట్విస్ట్.. చివరకు ఏమైందంటే..
ఈ మొసలి తలను ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. గతంలో అనేక మంది ప్రయాణికులు బ్యాగుల్లో కొండచిలువలు, తాబేళ్లు వంటి వాటిని ప్రాణాలతో తరలిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే.
Viral Video: జిమ్‌లో ఊసరవెల్లుల కసరత్తులు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..