Share News

Viral Video: కారులో వచ్చి గుడ్లు ఎత్తుకెళ్లారు.. మరుసటి రోజు షాకింగ్ ట్విస్ట్.. చివరకు ఏమైందంటే..

ABN , Publish Date - Jan 10 , 2025 | 08:30 AM

కొందరు చూసేందుకు దర్జాగా, హుందాగా కనిపించినా.. వాళ్లు చేసే పనులన్నీ అంతా అసహ్యించుకునేలా, ఆగ్రహించుకునేలా ఉంటాయి. కొందరైతే మరీ చిల్లర పనులు చేస్తూ అందరికీ ఛీకొట్టించుకుంటుంటారు. ఖరీదైన కార్లలో వచ్చి రోడ్ల పక్కన పూల కుండీలు, నాలాలపై మూసే ఇనుప మూతలు తదితరాలను ఎత్తుకెళ్లే వారిని నిత్యం చూస్తుంటాం. ఇలాంటి..

Viral Video: కారులో వచ్చి గుడ్లు ఎత్తుకెళ్లారు.. మరుసటి రోజు షాకింగ్ ట్విస్ట్.. చివరకు ఏమైందంటే..

కొందరు చూసేందుకు దర్జాగా, హుందాగా కనిపించినా.. వాళ్లు చేసే పనులన్నీ అంతా అసహ్యించుకునేలా, ఆగ్రహించుకునేలా ఉంటాయి. కొందరైతే మరీ చిల్లర పనులు చేస్తూ అందరికీ ఛీకొట్టించుకుంటుంటారు. ఖరీదైన కార్లలో వచ్చి రోడ్ల పక్కన పూల కుండీలు, నాలాలపై మూసే ఇనుప మూతలు తదితరాలను ఎత్తుకెళ్లే వారిని నిత్యం చూస్తుంటాం. ఇలాంటి చిత్రవిచిత్ర నేరాలకు సంబంధిచిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కారులో వచ్చిన కొందరు వ్యక్తులు.. చివరకు చేసిన కక్కుర్తి పనులను చూసి అంతా అవాక్కవుతున్నారు. అయితే ఆ మరుసటి రోజు షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన పంజాబ్‌లో (Punjab) చోటు చేసుకుంది. కొందరు కారులో వచ్చి రోడ్డు పక్కన ఆపేశారు. అక్కడే ఉన్న దుకాణదారుడిని పిలిచి తమకు గుడ్లు కావాలని అడిగారు. దీంతో దుకాణదారుడు మొత్తం ఆరు ట్రేలలో గుడ్లు (Eggs) పెట్టి, కారులో ముందు వైపు కూర్చున్న వారికి అందిస్తాడు. ఆ తర్వాత కారులో కూర్చున్న వారు అతడికి డిజిటల్ పేమెంట్ (Digital payment) చేసేందుకు ప్రయత్నిస్తారు.

Viral Video: జిమ్‌లో ఊసరవెల్లుల కసరత్తులు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


అయితే చాలా సేపు చూసినా నగదు పంపించేందుక వీలు కాలేదని, క్యూఆర్ కోడ్ తీసుకురమ్మని చెబుతారు. దీంతో ఆ వ్యాపారి దుకాణం వద్దకు వెళ్లి క్యూఆర్ కోడ్ బాక్సును తీసుకుని కారు వద్దకు వెళ్లేందుకు రెండు అడుగులు వేస్తాడు. అయితే అప్పటికే కారు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా కారులో వచ్చిన వారు.. కక్కుర్తితో గుడ్లను ఎత్తుకుపోవడం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఈ ఫాస్ట్‌ ఫుడ్ తింటే ఏకంగా పైకేనేమో.. ఎలా చేశాడో చూస్తే నోరెళ్లబెడతారు..


కారులో వచ్చి గుడ్లు ఎత్తుకుపోయారంటూ వీడియో వైరల్ అవడంతో మరుసటి రోజు సదరు వ్యక్తులు మళ్లీ ఆ దుకాణం వద్దకు వచ్చినట్లు తెలిసింది. ఆన్‌లైన్ పేమెంట్ ప్రాసెస్‌లో ఉండడంతో తాము వెళ్లిపోయామని బదులిచ్చారు. ఎట్టకేలకు ఆ గుడ్లకు సంబంధించిన నగదు చెల్లించడంతో అంతా వారిని ప్రశంసిస్తున్నారు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆన్‌లైన్ పేమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘తిరిగి వచ్చి నగదు చెల్లించడం గ్రేట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వామ్మో.. ఇదేం సరదా.. పరుగెత్తుకుంటూ వచ్చి పాములపై దూకాడు.. చివరకు ఒళ్లు గగుర్పొడిచే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 10 , 2025 | 08:30 AM