Train Fighting: ఎన్నోసార్లు రైలు ప్రయాణాలు చేసి ఉంటారు కానీ.. ఇలాంటి సీన్ మాత్రం అస్సలు చూసి ఉండరు..!

ABN , First Publish Date - 2023-07-12T16:56:03+05:30 IST

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. దీనికితోడు సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో అబ్బాయిలతో పాటూ అమ్మాయిలు కూడా నెట్టింట వైరల్ అయ్యేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు...

Train Fighting: ఎన్నోసార్లు రైలు ప్రయాణాలు చేసి ఉంటారు కానీ.. ఇలాంటి సీన్ మాత్రం అస్సలు చూసి ఉండరు..!

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. దీనికితోడు సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో అబ్బాయిలతో పాటూ అమ్మాయిలు కూడా నెట్టింట వైరల్ అయ్యేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు మహిళల మధ్య చిన్న చిన్న సమస్యలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, రైలు బోగీలో మహిళ మధ్య చోటు చేసుకున్న గొడవకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (viral video) అవుతోంది. కోల్‌కతా లోకల్ ట్రైన్‍లో (Kolkata Local Train) ఈ ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందో తెలీదు గానీ కదులుతున్న రైల్లో మహిళల మధ్య ఉన్నట్టుండి (quarrel between women) గొడవ మొదలవుతుంది. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారుతుంది. రెండు గ్రూపులుగా విడిపోయిన మహిళలలు.. అంతా చూస్తుండగానే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. అంతటితో ఆగకుండా జుట్టు పట్టుకుని, చెప్పులతో కొట్టుకుంటారు. ఈ గొడవతో షాక్ అయిన మిగతా వారు.. మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు.

Snake Video: భయమనేది వీడి బ్లడ్‌లోనే లేదనుకుంటా.. అంత పెద్ద పామును ఒంటి చేత్తో పట్టేశాడు..!

అయినా వారు మాత్రం అస్సలు వినిపించుకోకుండా ఒకరినొకరు కొట్టుకుంటూనే ఉంటారు. మధ్యలో ఓ బాలుడు వారిని వారిచే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో వారి దెబ్బలకు అదుపుతప్పి కిందపడిపోతాడు. దీంతో మిగతా మహిళలంతా.. ‘‘మనకెందుకొచ్చిన గొడవ’’.. అనుకుంటూ మిన్నకుండిపోతారు. చాలా సేపటి తర్వాత వారంతట వారే సైలెంట్ అయిపోవడంతో గొడవ సర్దుమణుగుతుంది. అక్కడే ఉన్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Birth Day Gift: ఈ యువతి పుట్టిన రోజుకు కలలో కూడా ఊహించని గిఫ్ట్.. కేక్ పక్కనే వాటిని పెట్టి మరీ సెలబ్రేషన్స్..!

Updated Date - 2023-07-12T16:56:03+05:30 IST