Toilet with Bed: బాబోయ్.. ఇదేం రూమ్.. బ్యాచులర్స్ కోసమే ప్రత్యేకంగా కట్టారా ఏంటి..? బెడ్ పక్కనే బాత్రూం కూడా..!

ABN , First Publish Date - 2023-08-17T15:49:35+05:30 IST

రోజురోజుకూ జనాభా పెరిగే కొద్దీ స్థలాభావ సమస్య పెరిగిపోతోంది. ఇక పట్టణాలు, నగరాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కనీసం కారు పట్టేంత స్థలాన్ని కూడా ఖాళీగా ఉంచడం లేదు. చాలా మంది తమకు ఉన్న కొద్దిపాటి స్థలంలోనే అపార్ట్‌మెంట్‌లు లేపేస్తుంటారు. కొందరైతే..

Toilet with Bed: బాబోయ్.. ఇదేం రూమ్.. బ్యాచులర్స్ కోసమే ప్రత్యేకంగా కట్టారా ఏంటి..? బెడ్ పక్కనే బాత్రూం కూడా..!

రోజురోజుకూ జనాభా పెరిగే కొద్దీ స్థలాభావ సమస్య పెరిగిపోతోంది. ఇక పట్టణాలు, నగరాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కనీసం కారు పట్టేంత స్థలాన్ని కూడా ఖాళీగా ఉంచడం లేదు. చాలా మంది తమకు ఉన్న కొద్దిపాటి స్థలంలోనే అపార్ట్‌మెంట్‌లు లేపేస్తుంటారు. కొందరైతే.. బెడ్‌రూం, బాత్ రూం, వంట గదులన్నింటినీ ఒకే గదిలో సర్దేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో అద్దెదారులు కూడా అలాగే సర్దుకుపోతుంటారు. ఇలాంటి ఇళ్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ అద్దె ఇంటికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బెడ్ పక్కనే బాత్రూం ఉండడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాబోయ్.. ఇదేం రూమ్.. బ్యాచులర్స్ కోసమే ప్రత్యేకంగా కట్టారా ఏంటి..?.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఢిల్లీలోని (Delhi) గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని ఓ ఇంటికి సంబంధించిన ఫొటో (Viral photos) సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ చిన్న గదిలో (small room) చిన్న మంచంతో పాటూ పక్కనే ఓ ఫ్యాన్ పెట్టకునే స్థలం ఉంటుంది. అలాగే అటు పక్కనే వెస్ట్రన్ కమోడ్ ఏర్పాటు చేశారు. ఆ పక్కనే అద్దాలతో కూడిన స్నానాల గది (bathroom) కూడా ఉంది. వీటితో పాటూ గదిలో ఏసీ కూడా ఏర్పాటు చేశారు.

Viral: రోడ్డు పక్కన చిన్న కాఫీ స్టాల్.. తాగేందుకు వెళ్లి.. అక్కడ ఉన్న బోర్డుపై ఏం రాసి ఉందో చదివి అవాక్కైన కస్టమర్లు..!

ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) చేస్తున్నారు. ‘‘ఇదెక్కడి కొంపరా నాయనా’’.., ‘‘మంచం పక్కనే బాత్రూం ఏంట్రా’’.. ‘‘ఈ ఇంటిని నిర్మించిన వాడెవడో కానీ మహానుభావుడు’’.., ‘‘ఇది మంచంతో కూడిన టాయిలెట్’’.., ‘‘ఒకేచోట అన్ని సౌకర్యాలూ ఉన్న జైలులా ఉంది’’.., ‘‘ఇందులో ఉండాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి’’.. ‘‘ఇంతకీ ఇది ఇల్లా.. లేక ఏదైనా బొమ్మా’’.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

Mother: శుభ్రం చేద్దామని 26 ఏళ్ల కొడుకు గదిలోకి వెళ్తే ఏదో పాడు వాసన.. ఏంటా అని అనుమానంతో మంచం కింద చూస్తే..!

Updated Date - 2023-08-17T15:49:35+05:30 IST