Viral Video: ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళకు.. సడన్‌గా వినిపించిందో శబ్దం.. అరుపులు వినిపించిన వైపు వెళ్లి చూస్తే..!

ABN , First Publish Date - 2023-10-03T19:00:43+05:30 IST

సాటి మనిషి కష్టాల్లో ఉంటే సంబరపడే వాళ్లే గానీ.. సాయం చేసే వాళ్లు లేని రోజులివి. అయితే కొందరు మాత్రం మానవత్వం ఇంకా బతికే ఉంది అని నిరూపిస్తుంటారు. సాటి మనుషుల పట్లే గాదు.. జంతువుల పట్ల కూడా ప్రేమానురాగాలు కనబరుస్తుంటారు. ఇలాంటి ...

Viral Video: ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళకు.. సడన్‌గా వినిపించిందో శబ్దం.. అరుపులు వినిపించిన వైపు వెళ్లి చూస్తే..!

సాటి మనిషి కష్టాల్లో ఉంటే సంబరపడే వాళ్లే గానీ.. సాయం చేసే వాళ్లు లేని రోజులివి. అయితే కొందరు మాత్రం మానవత్వం ఇంకా బతికే ఉంది అని నిరూపిస్తుంటారు. సాటి మనుషుల పట్లే గాదు.. జంతువుల పట్ల కూడా ప్రేమానురాగాలు కనబరుస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా, ఓ మహిళకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళకు సడన్‌గా ఓ శబ్ధం వినిపిస్తుంది. చివరకు అరుపులు వినిపించిన వైపు వెళ్లి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. యూకేలోని (UK) మోర్న్ పర్వతాల పైకి ట్రెక్కింగ్‌కు (Trekking) వెళ్లిన ఓ మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. ట్రెక్కింగ్ ముగించుకుని ఇంటికి వస్తున్న ఆమెకు సమీపంలోని నది నుంచి ఏవో శబ్ధాలు వినిపించసాగాయి. దీంతో ఏంటో చూద్దామని శబ్ధం వస్తున్న ప్రాంతం వైపు వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే.. ఓ గొర్రె బురద నీటిలో చిక్కుకుని (sheep stuck in mud) బయటకు రాలేక ఇబ్బంది పడుతోంది. దాన్ని చూడగానే సదరు మహిళ చలించిపోయింది.

Marriage Video: పెళ్లికి వచ్చిన బంధువులంతా.. ఈ వరుడి వాయిస్ విని షాక్.. పాట పాడుతోంటే వాళ్ల రెస్పాన్స్‌ను మీరే చూడండి..!

ఎలాగైనా గొర్రెను కాపాడాలనే ఉద్దేశంతో బురదలోకి దిగింది. చివరకు దాన్ని కొమ్ములు పట్టుకుని (woman saved the sheep) ఎలాగోలా బయటకు లాక్కొచ్చింది. తీరా చూస్తే గొర్రెకు మొత్తం బురద అంటుకుపోయింది. దీంతో మళ్లీ దాన్ని అటు పక్కన నీటిలోకి తీసుకెళ్లి మొత్తం శుభ్రం చేస్తుంది. తనకు సాయం చేసిన మహిళ వైపు దూరంగా నిలబడి కొద్ది సేపు అలాగే చూస్తుండిపోయిన గొర్రె.. తర్వాత అక్కడి నుంచి మందలోకి వెళ్లిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మీరు రియల్ హీరో’’.. అంటూ కొందరు, ‘‘ఈమెది ఎంతం మంచి మనసు’’.. అని మరికొందరు, ‘‘ఈ గొర్రె పాలిట దేవతలా వచ్చిది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: లిఫ్ట్‌లో ఒంటరిగా ఉందని చొరవ తీసుకున్న యువకుడు.. మొదటిసారి క్షమించిన యువతి.. చివరికి రెండోసారి..

Updated Date - 2023-10-03T19:00:43+05:30 IST