Viral Video: అద్దాలు పగలగొట్టలేదు.. తాళంతో తీయనూ లేదు.. లాక్ చేసి ఉన్నా ఈ కారు డోర్లను ఎలా ఓపెన్ చేశారో చూస్తే..!

ABN , First Publish Date - 2023-09-06T18:56:30+05:30 IST

కొన్నిసార్లు నిర్మానుష్య ప్రదేశాల్లో వాహనాల టైర్ పంక్చర్ అవడం, ఉన్నట్టుండి ఇంటిజన్లలో చిన్న చిన్న సమస్యలు తలెత్తడం జరుగుతుంటుంది. ఇలాంటి సమయాల్లో కనీస అవగాహన ఉండడం వల్ల సమస్యను ఈజీగా పరిష్కరించుకోవచ్చు. కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలను సైతం చిన్న చిన్న ట్రిక్‌లతో పరిష్కరించవచ్చు. ఇది తెలీక చాలా మంది..

Viral Video: అద్దాలు పగలగొట్టలేదు.. తాళంతో తీయనూ లేదు.. లాక్ చేసి ఉన్నా ఈ కారు డోర్లను ఎలా ఓపెన్ చేశారో చూస్తే..!

బైకు, కార్లలో ప్రయాణాన్ని ఎంత ఎంజాయ్ చేస్తామో.. అత్యవసర సమయాల్లో సమస్యల నుంచి బయటపడేందుకు సదరు వాహనాల మరమ్మతులు తదితర అంశాలపై కూడా కనీస అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు నిర్మానుష్య ప్రదేశాల్లో వాహనాల టైర్ పంక్చర్ అవడం, ఉన్నట్టుండి ఇంటిజన్లలో చిన్న చిన్న సమస్యలు తలెత్తడం జరుగుతుంటుంది. ఇలాంటి సమయాల్లో కనీస అవగాహన ఉండడం వల్ల సమస్యను ఈజీగా పరిష్కరించుకోవచ్చు. కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలను సైతం చిన్న చిన్న ట్రిక్‌లతో పరిష్కరించవచ్చు. ఇది తెలీక చాలా మంది ఊరికే తెగ హైరానా పడిపోతుంటారు. ఇలాంటి చిట్కాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. అద్దాలు పగులగొట్టకుండా, తాళం అవసరం లేకుండా డోరు అద్దాన్ని తీయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు...

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ హల్‌చల్ చేస్తోంది. కారు డోర్లు (Car doors) లాక్ అవడం వల్ల లోపల ఉన్న చిన్నారులు ఊపిరాడక మృతి చెందిన వార్తలు తరచూ వింటూ ఉంటాం. అలాంటి సమయాల్లో కొందరు గమనించినా డోర్లు తీయడంలో జాప్యం కారణంగా కూడా లోపల ఉన్న వారికి ప్రాణాపాయం కలగవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో అద్దాలు పగలగొట్టకుండా, తాళంతో పని లేకుండా (Car door opened without key) సులభంగా డోరు తీయొచ్చని ఓ వ్యక్తి చేసి చూపించాడు. ఇందుకోసం ఓ చిన్నారిని కారు ముందు సీటులో పడుకోబెట్టి, డోర్లు లాక్ చేశాడు. తర్వాత తన చేతిలో రెండే రెండు కర్ర ముక్కలు తీసుకుని కారు వద్దకు వెళ్లాడు. ఆ కర్రలకు చివర్లో రబ్బరు మూత తరహాలో ఉన్న వస్తువులను అతికించాడు. ఆ రబ్బరును చివరకు కారు ముందు డోరు అద్దానికి అంటించాడు.

Metro Train: రద్దీగా ఉన్న మెట్రో రైల్లో ప్రేమ జంట రొమాన్స్.. ఓ ఆంటీకి చిర్రెత్తుకొచ్చి ఏం చేసిందో మీరే చూడండి..!

రబ్బరు మూతను గట్టిగా నొక్కడం వల్ల అద్దానికి అతుక్కుపోతుంది. తర్వాత రెండు కర్రలకు ఉన్న రబ్బరు మూతల చుట్టూ టేపును అంటిస్తాడు. చివరగా రెండు కర్రలను పట్టుకుని కిందకు లాగగానే ఆశ్చర్యకరంగా కారు అద్దం కిందకు దిగిపోతుంది. తర్వాత చేయి లోపలికి పెట్టి, డోరును అన్‌లాక్ చేస్తాడు. ఈ విధంగా అద్దాలను ధ్వంసం చేయకుండానే ఈజీగా డోరు తీసి, పిల్లలను కాపాడవచ్చని వివరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! నీ తెలివికి హ్యాట్సాప్ బ్రదర్’’.. అంటూ కొందరు, ‘‘అత్యవసర సమయాల్లో ఇంత ఆలస్యం చేయకుండా అద్దాలు పగులగొట్టడమే బెటర్’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి చిట్కాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే.. ఏదో ఒక సందర్భాల్లో ఉపయోగపడతాయ్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సింహాలను చూసి ఆగిపోయిన వాహనాలు.. ఆరటిపండ్ల వ్యాపారి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా సడన్‌గా రావడంతో..

Updated Date - 2023-09-06T18:56:30+05:30 IST