Indian Railway: రైలు ప్రయాణమే ఈ భార్యాభర్తలిద్దరి ప్రాణాలనూ తీసేసింది.. స్టేషన్ వచ్చింది కదా అని దిగడానికి వెళ్తే..!

ABN , First Publish Date - 2023-09-05T16:31:24+05:30 IST

‘‘నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’’.. అని ఓ కవి అన్నట్లుగా.. చాలా మందికి నిజ జీవితంలోనూ ఇలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతుల విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. వారు ఎక్కిన రైలే.. చివరికి వారికి..

Indian Railway: రైలు ప్రయాణమే ఈ భార్యాభర్తలిద్దరి ప్రాణాలనూ తీసేసింది.. స్టేషన్ వచ్చింది కదా అని దిగడానికి వెళ్తే..!

‘‘నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’’.. అని ఓ కవి అన్నట్లుగా.. చాలా మందికి నిజ జీవితంలోనూ ఇలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతుల విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. వారు ఎక్కిన రైలే.. చివరికి వారికి శాపంగా మారుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. రైల్లో బయలుదేరిన దంపతులు.. వారి స్టేషన్ రావడంతో దిగేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చివరికి దిగాల్సిన స్టేషన్‌లోనే ఆ దంపతులు ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) కాన్పూర్‌‌లోని ఫరూఖాబాద్‌ జహంగంజ్‌ పరిధి పటౌలా గ్రామానికి చెందిన మహ్మద్(52)కు.. భార్య తబస్సుమ్ (50), కుమార్తెలు ఇలిమ్, సిద్రా, కుమారులు హరున్, అమన్ ఉన్నారు. తబస్సుమ్ స్థానికంగా ఆశా వర్కర్‌గా పని చేస్తుండగా.. మహ్మద్ కూలి పనులు చేస్తూ కుటుబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలావుండగా, కొన్ని నెలలుగా కడుపు సంబంధిత సమస్యతో (Stomach related problem) బాధపడుతోంది. చాలా మంది వైద్యుల వద్ద చూపించినా సమస్యస తగ్గలేదు. తెలిసిన వారు చెప్పడంతో కళ్యాణ్‌పూర్‌లో వైద్యుడి వద్దకు వెళ్లేందుకు మహ్మద్ తన భార్యను తీసుకుని సెప్టెంబర్ 1న బయలుదేరాడు. వారికి తోడుగా తబస్సుమ్ సోదరుడు జుబేర్‌ కూడా వెళ్లాడు. అంతా కలిసి ఫరూఖాబాద్ రైల్వే స్టేషన్‌లో (Farrukhabad Railway Station) కళ్యాణ్‌పూర్‌కు ప్యాసింజర్ రైలు ఎక్కారు.

Husband: రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లిన భార్య.. తిరిగొచ్చేసరికి ఈ భర్త ఇలా చేశాడేంటి..? ఇంటి తలుపులు తీసి చూస్తే..!

uttar-pradesh-crime.jpg

రైలు మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కళ్యాణ్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అయితే రైలు దిగే సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మహ్మద్, జుబేర్‌ ఇద్దరూ రైలు దిగేశారు. అయితే తబస్సుమ్ దిగే సమయంలో రైలు కదిలింది. అయినా ఆమె కంగారుపడుతూ దిగడంతో రైలుకు, ప్లాట్‌ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయింది. భార్యను రక్షించేందుకు మహ్మద్ పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ఆమెను పైకి లాగే సమయంలో అతను కూడా ప్రమాదవశాత్తు లోపల ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో తబస్సుమ్ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మహ్మద్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అతను కూడా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్పత్రికి వెళ్లిన దంపతులు.. ఇలా అనుకోకుండా మృత్యువాత పడడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Virtual Lover: నలుగురు పిల్లలతో పాటు తల్లి దారుణ హత్య.. భర్తపై డౌట్ వచ్చింది కానీ.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

Updated Date - 2023-09-05T16:31:24+05:30 IST