Shocking News: ఇది అద్భుతం కాక ఇంకేంటి..? వంటగదిలో తల్లి.. బాల్కనీలోంచి కింద పడిన పాప.. చివరకు..!

ABN , First Publish Date - 2023-09-05T19:21:20+05:30 IST

సినిమాల్లో కనిపించే అద్భుతాలన్నీ కొన్నిసార్లు నిజ జీవితంలోనూ కనిపిస్తుంటాయి. ప్రధానంగా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే సమయంలో కొందరు.. ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో.. ‘‘అరె! ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అని అనిపిస్తుంటుంది. తాజాగా..

Shocking News: ఇది అద్భుతం కాక ఇంకేంటి..? వంటగదిలో తల్లి.. బాల్కనీలోంచి కింద పడిన పాప.. చివరకు..!

సినిమాల్లో కనిపించే అద్భుతాలన్నీ కొన్నిసార్లు నిజ జీవితంలోనూ కనిపిస్తుంటాయి. ప్రధానంగా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే సమయంలో కొందరు.. ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో.. ‘‘అరె! ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అని అనిపిస్తుంటుంది. తాజాగా, రాజస్థాన్‍‌లో ఇలాంటి ఆశ్చర్యకర ఘటనే చోటు చేసుకుంది. తల్లి వంట గదిలో ఉండగా.. వారి ఏదాదిన్నర పాప బాల్కనీలో ఆడుకుంటూ ఉంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒకటో అంతస్తు నుంచి కిందపడింది. ఈ ఘటనలో చివరకు ఏం జరిగిందంటే..

రాజస్థాన్ (Rajasthan) సంచోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలోని కాలనీలో ఉంటున్న అశోక్ ఖత్రి అనే వ్యక్తికి భార్య, ఏదాడిన్నర కూతరు లావ్య ఉన్నారు. శనివారం కాలనీలో ఆశ్చర్యకర ఘటన (surprising incident) చోటు చేసుకుంది. అశోక్ భార్య వంట గదిలో ఉండగా.. వారి కూతురు బాల్కనీలో ఆడుకుంటూ ఉంది. పాప ఆడుకునే క్రమంలో గోడ పక్కన ఉన్న చెత్త బుట్ట పైకి ఎక్కింది. దీంతో అదుపు తప్పి మొదటి అంతస్తు నుంచి (child fell from the first floor) ధమేల్‌మని కిందపడింది. దీంతో కాసేపు అలాగే పడుకుని ఉండిపోయింది.

Viral Video: వామ్మో! ఇదెక్కడి డ్రైవింగ్‌రా బాబోయ్.. రోడ్డుపై ఎంత ట్రాఫిక్ ఉంటే మాత్రం.. ఏ ఆటో డ్రైవరైనా ఇలా చేస్తాడా..

baby.jpg

శబ్ధం విన్న వెంటనే అక్కడే ఉన్న ఓ మహిళ పరుగెత్తుకుంటూ వచ్చి పాపను ఎత్తుకుంది. తర్వాత తల్లిదండ్రులు కూతురును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆశ్చర్యకరంగా లావ్యకు ఏమీ కాలేదు. కనీసం చిన్న గీత కూడా పడలేదు. అన్ని పరీక్షలూ చేసిన వైద్యులు.. పాపకు ఎలాంటి గాయాలూ కాలేదని చెప్పారు. అప్పటికీ నమ్మకం లేని తల్లిదండ్రులు.. చిన్నారిని మరుసటి రోజు గుజరాత్ తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన అక్కడి వైద్యులు కూడా ఏమీ కాలేదని చెప్పడంతో అంతా హమ్మయ్య!.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, సీసీ కెమెరా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Shocking: డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు కదా అని ఆటో ఎక్కిందో యువతి.. కొద్దిదూరం వెళ్లగానే ఇద్దరు కుర్రాళ్ల ఎంట్రీ.. చివరకు..!

Updated Date - 2023-09-05T19:21:20+05:30 IST