Viral Video: కొద్ది సెకన్లలో చనిపోబోయే పాము.. తనను తానే కాటు వేసుకుంటే.. విస్తుపోయేలా చేస్తున్న వీడియో..!

ABN , First Publish Date - 2023-06-20T17:00:37+05:30 IST

ప్రపంచంలో ఉండే అనేక రకాల పాముల్లో కొన్ని మాత్రమే విషపూరితమైనవి. అయితే వీటిలో మరికొన్ని అత్యంత ప్రమాదకరం. ఒకసారి కాటు వేశాయంటే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అందుకే అలాంటి పాములను పట్టుకునే క్రమంలో స్నేక్ క్యాచర్లు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినా...

Viral Video: కొద్ది సెకన్లలో చనిపోబోయే పాము.. తనను తానే కాటు వేసుకుంటే.. విస్తుపోయేలా చేస్తున్న వీడియో..!

ప్రపంచంలో ఉండే అనేక రకాల పాముల్లో కొన్ని మాత్రమే విషపూరితమైనవి. అయితే వీటిలో మరికొన్ని అత్యంత ప్రమాదకరం. ఒకసారి కాటు వేశాయంటే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అందుకే అలాంటి పాములను పట్టుకునే క్రమంలో స్నేక్ క్యాచర్లు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినా కొన్నిసార్లు వాటి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకొంటుంటారు. ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న పాము వీడియో చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. కొద్ది సెకన్లలో చనిపోబోయే పాము.. తనని తానే ఎలా కాటు వేసుకుందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. అత్యంత ప్రమాదకరమైన ఓ పామును (dangerous snake) కొందరు చంపేసి.. తలను వేరు చేసి పక్కన పడేస్తారు. అయినా ఆ పాము ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అయితే అయితే పడి ఉన్న పాము తల (head) ప్రాణం లేనట్లుగా కనిపిస్తుంటుంది. తల తెగిన పాము తోకను అటూ ఇటూ తిప్పుతూ చివరకు పాము తల వద్దకు తీసుకెళ్తుంది. దీంతో ఒక్కసారిగా అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. తోక దగ్గరికి వచ్చి తాకగానే.. అప్పటిదాకా చలనం లేకుండా పడి ఉన్న తలలో ఒక్కసారిగా ప్రాణం వస్తుంది. నోరు తెరచి తన తోకను తానే గట్టిగా పట్టుకుని (snake bite) కాటు వేస్తుంది.

Eggs: ఉడికించిన గుడ్లను వాసన చూసి వదిలేసిన పెంపుడు కుక్క.. అనుమానంతో ఆ యజమాని గుడ్లను కట్ చేసి చూస్తే..!

దీంతో పాము తన తల నుంచి తప్పించుకోవడానికి తెగ ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలో పాము తన తోకను వేగంగా అటూ ఇటూ తిప్పుతుంది. అయినా తన కాటు నుంచి తాను తప్పించుకోలేకపోతుంది. చూస్తుండగానే ప్రాణాలు విడిచేస్తుంది. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.‘‘తల వేరు చేసినా పాములు కాటు వేయగలవు’’.. అని కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి’’.. అని ఇంకొందరు, ‘‘వామ్మో! చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Laptop: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. రూ.54 వేల ఖరీదైన ల్యాప్‌టాప్.. కేవలం రూ.24 వేలకేనట..!

Updated Date - 2023-06-20T17:00:37+05:30 IST