Viral Video: వారెవ్వా.. ఏం సీన్ గురూ.. ఓ కాలు లేని బాలిక.. సడన్‌గా నడుచుకుంటూ వస్తోంటే స్కూల్‌లో ఆ పిల్లలంతా చూసి..

ABN , First Publish Date - 2023-07-20T16:07:02+05:30 IST

సోషల్ మీడియాలో నిత్యం వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యాన్ని.. మరికొన్ని ఆనందాన్ని కలిగిస్తే.. ఇంకొన్ని తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. అలాగే చాలా అరుదుగా చోటు చేసుకునే కొన్ని ఘటనలు చూసినప్పుడు.. వారెవ్వా.. ఏం సీన్ గురూ.. అని అనిపిస్తుంటుంది. తాజాగా...

Viral Video: వారెవ్వా.. ఏం సీన్ గురూ.. ఓ కాలు లేని బాలిక.. సడన్‌గా నడుచుకుంటూ వస్తోంటే స్కూల్‌లో ఆ పిల్లలంతా చూసి..

సోషల్ మీడియాలో నిత్యం వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యాన్ని.. మరికొన్ని ఆనందాన్ని కలిగిస్తే.. ఇంకొన్ని తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. అలాగే చాలా అరుదుగా చోటు చేసుకునే కొన్ని ఘటనలు చూసినప్పుడు.. వారెవ్వా.. ఏం సీన్ గురూ.. అని అనిపిస్తుంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాలు లేని బాలిక అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. స్కూల్లోకి నడుచుకుంటూ వచ్చింది. స్నేహితులతో కలిసి పరుగులు తీసింది. తోటి స్నేహితురాలిని సడన్‌గా అలా చూసిన బాలికలు చివరకు ఏం చేశారంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాలికకు (girl) కాలు పోవడంతో స్కూల్‌కు దూరమవుతుంది. అయితే కొన్ని నెలల అనంతరం ఉన్నట్టుండి స్కూల్లో అడుగుపెడుతుంది. తమ స్నేహితురాలు నడుచుకుంటూ స్కూల్లోకి రావడం చూసి మిగతా బాలికలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అరె! వస్తోంది.. మన స్నేహితురాలేనా.. ఎంత బాగా నడుస్తోంది’’.. అనుకుంటూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు. వారి దగ్గరికి వెళ్లిన బాలిక తనకు అమర్చిన కృత్రిమ కాలును (prosthetic leg) చూపిస్తుంది. కాలును గమనించిన తోటి స్నేహితులంతా సంతోషం వ్యక్తం చేస్తారు.

Snake: బాత్రూంలోకి వెళ్లిన అతడికి పై ప్రాణాలు పైనే పోయాయ్.. అంత పెద్ద పాము.. ఇంట్లోకి ఎలా చేరిందబ్బా..!

వెంటనే బాలికను గట్టిగా కౌగిలించుకుని స్వాగతం పలుకుతారు. తర్వాత సదరు బాలిక పరుగెత్తుకుంటూ వెళ్లడం చూసి అంతా.. ఆమె వెంటే పరుగెత్తుతూ వెళ్తారు. ఈ దృశ్యం చూసి అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ‘‘ఇంత బాధలోనూ ఈ అమ్మాయి ఎంత ధైర్యంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘బాలిక భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నాం’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి స్నేహితులు అందరికీ ఉంటే ఎంత బాగుంటుంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట 9మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: పనస పండ్లు కోసేందుకు చెట్టెక్కాడు.. అనుమానం వచ్చి పాదాల వైపు చూసుకుని చివరకు ఖంగుతిన్నాడు..

Updated Date - 2023-07-20T16:07:02+05:30 IST