Marriage: జీవితాంతం మర్చిపోలేని థ్రిల్.. పెళ్లి రోజే కావాలని ఈ వధూవరుల మాస్టర్ ప్లాన్.. బంధువులందరినీ పిలిచి..!

ABN , First Publish Date - 2023-07-29T21:46:23+05:30 IST

యువతీయువకులకు వివాహం అనేది జీవితాంతం తీపి జ్ఞాపకంగా మిగిలిపోయే ఘట్టం. అందుకే ఆ క్షణాలను అందంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కొందరు లక్షలు ఖర్చు చేసి వివాహాలు చేసుకుంటే.. మరికొందరు విచిత్రంగా హెలీకాప్టర్లలో ఎగురుతూ ఆకాశవీధిలో పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. ఇంకొందరు...

Marriage: జీవితాంతం మర్చిపోలేని థ్రిల్.. పెళ్లి రోజే కావాలని ఈ వధూవరుల మాస్టర్ ప్లాన్.. బంధువులందరినీ పిలిచి..!

యువతీయువకులకు వివాహం అనేది జీవితాంతం తీపి జ్ఞాపకంగా మిగిలిపోయే ఘట్టం. అందుకే ఆ క్షణాలను అందంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కొందరు లక్షలు ఖర్చు చేసి వివాహాలు చేసుకుంటే.. మరికొందరు విచిత్రంగా హెలీకాప్టర్లలో ఎగురుతూ ఆకాశవీధిలో పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. ఇంకొందరు వివాహానంతరం హనీమూన్ పేరుతో దేశ, విదేశాలను చుట్టొస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే నూతన దంపతులు వారి వివాహమైన రోజే విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. బంధువులందరినీ పిలిచి, అందరి సమక్షంలో వారు చేసిన పనికి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వధూవరులు సంబంధించి వీడియో (bride and groom Viral videos) ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ప్రిస్సిల్లా, ఫిలిప్పో అనే వధూవరులు తమ వివాహం.. అంతా చర్చించుకునేలా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మిగతా వారికి భిన్నంగా ఉండాలని ఆలోచించారు. చివరకు ఓ నిర్ణయానికి వచ్చి బంధువులందరికీ ఆహ్వానం అందించారు. అందరినీ ఓ ఎత్తైన కొండ వద్దకు రమ్మన్నారు. అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య వివాహం (marriage) చేసుకున్నారు. అనంతరం అందరినీ ఆశ్చర్యపరుస్తూ కొండ అంచుకు వచ్చి.. పైనుంచి స్కైడైవింగ్ (Skydiving) చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో బంధువులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Viral Video: కొన్ని నెలలుగా మంచంపై పడుకోవడానికే భయపడుతున్న ఆర్మీ అధికారి.. చివరకు కేర్ టేకర్ వెళ్లి పరుపు కింద పరిశీలించగా..

పెళ్లి రోజు సంతోషంగా గడపకుండా ఇవేం పిచ్చి పనులంటూ అంతా వారిస్తున్నా.. వధూవరులు మాత్రం వినిపించుకోలేదు. అనుకున్న విధంగానే అందరి సమక్షంలో మరి కొందరితో కలిసి కొండ పైనుంచి లోయలోకి దూకేశారు. గాల్లో కాసేపు విహరించి చివరకు క్షేమంగా నేలపై ట్యాండ్ అయ్యారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వాహ్వా! ఇది కదా అసలు సిసలు థ్రిల్ అంటే’’.. అని కొందరు, ‘‘వీరి వివాహం నిజంగా జీవితాంతం గుర్తుంటుంది’’.. అని మరికొందరు, ‘‘వధువుకు ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 77వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అప్పటిదాకా కేవలం కుక్కలే కదా అనుకున్నాడు.. ఒకే ఒక్క ఘటనతో వాటి ఉపయోగం తెలిసొచ్చింది.. నిమిషం ఆలస్యం అయ్యున్నా..

Updated Date - 2023-07-29T21:46:23+05:30 IST