Kasani Gnaneshwar: తెలంగాణ కేటీఆర్ జాగీరు కాదు

ABN , First Publish Date - 2023-10-01T19:37:31+05:30 IST

తెలంగాణ కేటీఆర్(KTR) జాగీరు కాదని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) వ్యాఖ్యానించారు.

Kasani Gnaneshwar: తెలంగాణ కేటీఆర్ జాగీరు కాదు

హైదరాబాద్: తెలంగాణ కేటీఆర్(KTR) జాగీరు కాదని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు కాసాని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘చంద్రబాబు(Chandrababu)కు మద్దతుగా హైదరాబాద్‌లో ఆందోళనలు చేయొద్దనటానికి కేటీఆర్ ఎవరు? కేసీఆర్ మహరాష్ట్ర ఎందుకు వెళ్తున్నారో చెప్పాలి? మహరాష్ట్రకు వెళ్లి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి.. చందాన ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆకాశంపై ఉమ్మేస్తే.. తమ మోహంపైనే పడుతుందని ఆంధ్రప్రదేశ్ పాలకులు గుర్తించాలి. కుట్ర ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబు అక్రమ అరెస్ట్, లోకేష్‌పై కేసులు పెడుతున్నారు. చంద్రబాబును జైల్లో ఉంచి.. ఎన్నికలకు వెళ్లాలనేదే జగన్ ప్లాన్. కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారు. నాయకులకు మానవత్వం అవసరం...మంచి చెడు గుర్తించి మెలగాలి’’ అని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-01T19:37:31+05:30 IST