Share News

Peethala Sujatha: సాక్షిలో తప్పుడు రాతలపై పీతల సుజాత ఆగ్రహం

ABN , Publish Date - Jul 06 , 2024 | 05:54 PM

సాక్షిలో తప్పుడు రాతలపై మాజీ మంత్రి పీతల సుజాత (Peethala Sujatha) ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు సాక్షిలో తప్పుడు రాతలు కూడా అలాగే ఉన్నాయని విమర్శించారు.

Peethala Sujatha: సాక్షిలో తప్పుడు రాతలపై పీతల సుజాత ఆగ్రహం
Peethala Sujatha

అమరావతి: సాక్షిలో తప్పుడు రాతలపై మాజీ మంత్రి పీతల సుజాత (Peethala Sujatha) ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు సాక్షిలో తప్పుడు రాతలు కూడా అలాగే ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కూప్పగా మార్చి... అప్పుడే అన్ని హామీలు అమలు చేయాలంటూ పెడబొబ్బలు పెడుతున్నారని మండిపడ్డారు.

జగన్ ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీల్లో 80% అమలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అమ్మఒడి పేరుతో బడిపిల్లలను మోసం చేశారన్నారు. ఆసరా పేరుతో మహిళలకు అన్యాయం చేశారని చెప్పారు.చేయూత పేరుతో చేతివాటం చూపించారని, ఇచ్చిన హామీని ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయకుండా నేడు అప్పుడే హామీలు అమలు చేయాలంటూ రాయడం సిగ్గుచేటని అన్నారు.


చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ఐదు సంతకాలు పెట్టి తన నిబద్ధతను నిరూపించుకున్నారని తెలిపారు. 1వ తేదీనే అవ్వాతాతలకు పెంచిన పింఛన్ రూ. 7000లు ఇచ్చి ఆదుకున్నారని ఉద్ఘాటించారు. మంత్రి నారా లోకేష్ భారీగా టీచర్ల భర్తీకి శ్రీకారం చుట్టారన్నారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు.

అరాచకాలు, హత్యలు, గంజాయికు అడ్డాగా రాష్ట్రాన్ని మార్చారని దుయ్యబట్టారు. 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయినా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. మాచర్లలో అరాచకం సృష్టించిన ఖైదీని పలకరించేందుకు వెళ్లి జగన్ రెడ్డి ఎలాంటి వారో ప్రజలే అర్థం చేసుకున్నారన్నారు. ఇకనైనా జగన్ రెడ్డి మారాలి... లేదంటే ప్రజా కోర్టులో పాతాలానికి తొక్కడం ఖాయమని పీతల సుజాత హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Achchennaidu: బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

Anam: ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన

AppalaNaidu: కేంద్రం, రాష్ట్రంలో ప్రజాపాలన

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 06 , 2024 | 06:12 PM