Share News

Chandrababu Naidu swearing in: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు

ABN , First Publish Date - Jun 12 , 2024 | 07:39 AM

AP CM Chandrababu Naidu Swearing in Ceremony Live News Updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా.. ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు అత్యంత భారీ టెంట్లను ఏర్పాటు చేశారు.

Chandrababu Naidu swearing in: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు
Chandrababu Naidu swearing in

Live News & Update

  • 2024-06-12T13:59:08+05:30

    ఉండవల్లికి చేరుకున్న చంద్రబాబు..

    • సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఉండవల్లి నివాసాలకు చేరుకున్న చంద్రబాబు నాయుడు

    • చంద్రబాబు రాకతో భారీగా బాణాసంచా కాల్చుతూ స్వాగతం పలికిన అయన సిబ్బంది

  • 2024-06-12T12:52:48+05:30

    చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై ఇంట్రస్టింగ్ సీన్..

    చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సభా వేదికపై ఇంట్రస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. పవన్ కల్యాణ్, చిరంజీవి ఇద్దరినీ చేయి పట్టుకుని లాక్కెళ్లారు. వారితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని మోదీ..

  • 2024-06-12T12:29:15+05:30

    ఏపీలో కొలువుదీరిన కొత్త సర్కార్..

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేశారు. మంత్రులుగా పవన్‌కల్యాణ్‌, లోకేష్‌, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌, పి. నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్‌ యాదవ్‌, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌, కందుల దుర్గేష్‌, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌రెడ్డి, కందుల దుర్గేష్‌, టీజీ భరత్‌, ఎస్‌.సవిత, వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

  • 2024-06-12T12:24:44+05:30

    చంద్రబాబును ఆలింగనం చేసుకున్న ప్రధాని మోదీ..

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోదీ ఆలింగం చేసుకున్నారు.

  • 2024-06-12T12:20:43+05:30

    సీఎం చంద్రబాబు, మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రమేష్..

    • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణం స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు గారికి శుభాకాంక్షలు

    • రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారికి అభినందనలు

    • రాష్ట్ర నూతన మంత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు

    • ఏపీలో కూటమి ప్రభుత్వం రావడం..ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల సాకారానికి శుభ సూచకం

    • కేంద్ర సహకారంతో రాష్ట్రాభివృద్ధికి కూటమి నాయకులు కృషి చేయాలి

    • రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ..నేటి నుంచి ప్రజాసుపరిపాలన ప్రారంభం

    • వైసీపీ దుర్మార్గపు పాలనకు స్వస్తి పలికిన ప్రజలకు. ఈ రోజు నుంచి అన్నీ మంచి రోజులే

    • చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలని కోరుతున్నాను

    • ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పరిపాలన సాగాలని కోరుకుంటున్నాను.

  • 2024-06-12T12:18:47+05:30

    దేవుళ్లకు మొక్కులు చెల్లించుకున్న టిడిపి శ్రేణులు

    • చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడంతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు

    • రైల్వే న్యూ కాలనీలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి సంబరాలు జరుపుకున్న టిడిపి శ్రేణులు

    • అనంతరం లక్ష్మీ గణేష్ ఆలయం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టిన పార్టీ నేతలు,కార్యకర్తలు,తెలుగు మహిళలు

    • సైకో పోయి.. సైకిల్ పాలన వచ్చినందుకు డప్పులు కొట్టి డాన్సులు చేసిన టిడిపి కార్యకర్తలు

  • 2024-06-12T11:53:59+05:30

    ప్రమాణ స్వీకారం చేసిన కొల్లు రవీంద్ర

    ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కొల్లు రవీంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలోనూ కొల్లు రవీంద్ర మంత్రిగా పని చేశారు.

  • 2024-06-12T11:52:48+05:30

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అచ్చెన్నాయుడు

    టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014లోనూ ఆయన మంత్రిగా పని చేశారు. ఇప్పుడు మరోసారి టీడీపీ ప్రభుత్వం రావడంతో అచ్చెన్నాయుడు మరోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

  • 2024-06-12T11:48:38+05:30

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్..

    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • 2024-06-12T11:43:12+05:30

    చంద్రబాబును అభినందించిన ప్రధాని మోదీ..

    ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

  • 2024-06-12T11:39:43+05:30

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్..

    ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కొణిదెల పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనచే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

  • 2024-06-12T11:37:00+05:30

    ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రముఖులు

    చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు.

  • 2024-06-12T11:33:01+05:30

    ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం..

    ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా చంద్రబాబును నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • 2024-06-12T11:28:55+05:30

    ప్రమాణ స్వీకారోత్సవం కోసం 29 ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్స్..

    • ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించేందుకు తూర్పు గోదావరి జిల్లాలో 29 ప్రాంతాల్లో ఎల్ఈడీ స్ర్కీన్స్ ఏర్పాటు చేశారు.

    • ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రజలు

    • జిల్లాలో సంతరించుకున్న పండుగ వాతావరణం

  • 2024-06-12T11:22:30+05:30

    చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రముఖులు

    • కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ

    • హాజరైన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాళథ్‌ షిండే

    • మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ CJI ఎన్వీ రమణ

    • హాజరైన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, మెగాస్టార్ చిరంజీవి

    • గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సభా ప్రాంగణానికి..

    • బయల్దేరిన ప్రధాని మోదీ, చంద్రబాబు

    • కాసేపట్లో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం

  • 2024-06-12T11:17:10+05:30

    గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ..

    ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో చంద్రబాబు ప్రమాణ స్వీకార సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు.

  • 2024-06-12T11:12:31+05:30

    టీడీపీ శ్రేణుల సంబరాలు..

    ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం ఉత్సవం సందర్భంగా అనంతపురంలో సంబరాలు చేసుకుంటున్న టిడిపి నాయకులు కార్యకర్తలు

    0d0d74cc-222c-4d63-b646-d3d8bf2cecde.jpg

  • 2024-06-12T11:06:56+05:30

    కొల్లు రవీంద్రను సన్మానించిన దేవినేని ఉమ..

    • మచిలీపట్నం శాసనసభ్యులు కొల్లు రవీంద్రను మాజీ మంత్రి దేవినేని ఉమ విజయవాడ నివాసంలో కలిశారు.

    • నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కొల్లు రవీంద్రని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

    • కూటమికి ప్రజలు పట్టం కట్టిన తీరు అద్భుతం: దేవినేని

    • వైసీపీ అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారు

    • ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకే ఉంది

  • 2024-06-12T11:04:41+05:30

    ప్రమాణ స్వీకర సభకు చేరుకోలేని స్థితిలో ఎమ్మెల్యే లు.

    • ప్రకాశం వారది వద్ద ట్రాఫిక్ లో ఇరుక్కున్న కన్నా లక్ష్మీ నారాయణ, జి.వి.ఆంజనేయులు.

    • వారధి నుంచి గుంటూరు వరకు జాతీయ రహదారి పై నిలిచిపోయిన వాహనాలు,

    • ట్రాఫిక్ లో చిక్కకున్న పలువురు ప్రజా ప్రతినిధులు

  • 2024-06-12T10:29:12+05:30

    విజయవాడ చేరుకున్న ప్రఫుల్ పటేల్..

    విజయవాడ: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులైన నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ విజయవాడ చేరుకున్నారు. ‘చంద్రబాబు నాయుడు చాలా డైనమిక్ లీడర్, పూర్వ ఆంధ్రప్రదేశ్‌ని మార్చిన దార్శనికుడు. ఇప్పుడు ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త అభివృద్ధి శకం రాబోతుంది.’ అని ప్రఫుల్ పటేల్ అన్నారు.

  • 2024-06-12T10:14:30+05:30

    9 గంటలకే నిండి పోయినా సభ ప్రాంగణం

    సభ ప్రాంగణం నిండిపోయి రోడ్లు పై నిలిచిపోయిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చిన ప్రజానీకం.

    సభ ప్రాంగణానికి చేరుకుంటున్న ప్రమాణస్వీకారం చేయబోతున్న మంత్రులు ఎమ్మెల్యే లు.

    సభ ప్రాంగణానికి చేరుకున్న నారా, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు.

    గుంటూరు జిల్లా కాజా టోల్ గేటు వరకు నిలిచి పోయిన వాహనాలు.

  • 2024-06-12T09:51:56+05:30

    సభా ప్రాంగణంలో పోలీసులు ఓవర్ యాక్షన్

    • మీడియా ను గ్యాలరీ లో కూడా తిరగనివ్వకుండా ఆంక్షలు

    • మీడియా గ్యాలరీ లోనే ఉండాలని, బయటకు రావద్దని ఆంక్షలు

    • అసలు కనిపించని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు

    • మీడియా పై ఆంక్షలు పెడుతున్నా స్పందించని I & PR సిబ్బంది

    • లోకల్ మీడియా అంటూ స్టేట్ మీడియా ను ఒక పక్కన పడేసిన సమాచార శాఖ

  • 2024-06-12T09:51:19+05:30

    సభా వేదిక వద్దకు బయలుదేరిన లోకేష్..

    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉండవల్లిలోని స్వగృహం నుంచి సభా వేదిక వద్దకు బయలుదేరారు. మరికాసేపట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  • 2024-06-12T09:49:12+05:30

    ఏలూరు: హనుమాన్ జంక్షన్ హైవే పై స్థంభించిన ట్రాఫిక్

    • ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాలు, బస్సులను దారి మళ్ళిస్తున్న పోలీసులు

    • పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలు నిలుపుదల

    • అక్కడ నుంచి కేసరపల్లి నడిచి వెళ్ళాలని సూచిస్తున్న పోలీసులు

    • వాహనాలు కదిలే పరిస్థితి లేకపోవడంతో కాలి నడకన కేసరిపల్లి బయలుదేరిన టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు

  • 2024-06-12T09:31:42+05:30

    బెజవాడ అష్టదిగ్బంధనం

    • వారధి, ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి విజయవాడ లోకి అనుమతించని పోలీసులు

    • వారధి వద్ద గుంటూరు వైపు భారీగా నిలిచిన వాహనాలు

    • అదేవిధంగా గుంటూరు లోనే జాతీయ రహదారి పైకి వాహనాలను అనుమతించని పోలీసులు

    • విజయవాడ నగరంలో ఎక్కడికక్కడే బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు

    • పాస్ లు ఉన్న కార్లను కూడా ఆపుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం

    • కేసరపల్లి సభా స్థలి జాతీయ రహదారి పై వద్ద భారీగా స్తంభించిన ట్రాఫిక్

    • చోద్యం చూస్తున్న పోలీసులు

    • ట్రాఫిక్ లో ఇరుక్కున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వాహనం

    • సభా స్థలి వద్ద అంతా గందరగోళం

    • పాస్ లు వున్న పంపించని పోలీసులు

  • 2024-06-12T09:30:10+05:30

    విజయవాడ: కూటమికి ప్రజలు పట్టం కట్టిన తీరు అద్భుతం: మంత్రి కొలుసు పార్థసారథి

    • వైసిపి అరాచక పాలన కు ప్రజలు బుద్ధి చెప్పారు

    • నా పై నమ్మకం తో చంద్రబాబు నాకు మంత్రి గా అవకాశం కల్పించారు

    • పాత, కొత్త కలయికతో మంత్రి వర్గ కూర్పు బాగుంది

    • ఎపి ని అన్ని విధాలా అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబు కి ఉంది

    • కూటమి విజయం లో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్, లోకేష్, పురందేశ్వరి లకు ధన్యవాదాలు

    • నూజివీడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ను పరిష్కరిస్తా

  • 2024-06-12T08:44:59+05:30

    సీఎం ప్రమాణ స్వీకారం వీక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు

    • నెల్లూరులో సీఎం ప్రమాణస్వీకరణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.

    • జిల్లా వ్యాప్తంగా 12 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు. ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికీ విద్యత్తు దీపాలంకరణ.

    • ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 32 బస్సుల్లో గన్నవరంకి తరలి వెళ్లిన ప్రజలు.

  • 2024-06-12T08:43:13+05:30

    సీఎంగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు

    • 1978లో చంద్రగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రబాబు

    • 1980 నుంచి 1983 వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబు

    • 1995లో ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారి చంద్రబాబు బాధ్యతలు

    • 1999లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు

    • 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు

    • 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

    • 2019 నుంచి 2024 వరకు నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు

    • నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా నేడు ప్రమాణం చేయనున్న చంద్రబాబు

  • 2024-06-12T07:37:58+05:30

    Chandrababu Naidu swearing as AP CM: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా.. ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు అత్యంత భారీ టెంట్లను ఏర్పాటు చేశారు.

    వేలాది మందికి ఆహ్వానం..

    ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వేలాది మందికి ఆహ్వానాలు పంపించారు. ప్రత్యేక ఆహ్వానితులు, వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేకంగా పాసులు జారీచేశారు. ఈ కార్యక్రమానికి విదేశీ, జాతీయస్థాయి అతిథులు తరలి వస్తున్నారు. దాదాపుగా ఆహూతులంతా మంగళవారం రాత్రికి విజయవాడ చేరుకున్నారు. మరోవైపు భారీ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో సభకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రజలందరికీ సభావేదికపై దృశ్యాలు కనిపించేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.

    ఏర్పాట్లు అదుర్స్..

    ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేశారు. వేదికపై 60 మంది వరకు కూర్చునేలా ఏర్పాటుచేశారు. ప్రత్యేక ఆహ్వానితుల కోసం వేదిక వెనుక భాగంలో గ్రీన్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశారు. ఆ రూమ్స్‌ని ఆయా ప్రముఖులకు కేటాయించారు. అలాగే, ప్రధానమంత్రి మోదీ కోసం ప్రత్యేకంగా వేదికకు అత్యంత సమీపంలో గ్రీన్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో పాటు, హోంమంత్రి అమిత్‌షా, నడ్డా , ఇతర కేంద్ర మంత్రులు కూడా ఈ గ్రీన్‌ రూమ్‌కు చేరుకుంటారు. ప్రధాని గ్రీన్‌ రూమ్‌కు వెనుకభాగంలో పీఎంవో సిబ్బంది కోసం మరో రూమ్‌ను ఏర్పాటు చేశారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కోసం ఒక గ్రీన్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా గ్రీన్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గ్రీన్‌ రూమ్‌ పక్కనే వీవీఐపీల కోసం ఇంకో గ్రీన్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.