Share News

Minister Narayana: శానిటేషన్‌పై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Sep 09 , 2024 | 07:42 PM

పాయకపురంలో వరద ముంపు ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు(సోమవారం) పర్యటించారు. రైతు బజార్ రోడ్డులో వరద నీరు ఉన్న ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు.

Minister Narayana: శానిటేషన్‌పై  మంత్రి నారాయణ కీలక ఆదేశాలు

విజయవాడ: విజయవాడలోని పాయకపురంలో వరద ముంపు ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు(సోమవారం) పర్యటించారు. రైతు బజార్ రోడ్డులో వరద నీరు ఉన్న ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి మంత్రి ధైర్యం చెప్పారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. శానిటేషన్‌లో భాగంగా డ్రైనేజీపై బ్లీచింగ్ చల్లారు.


ALSO READ:Sam Pitroda: రాహుల్ పప్పు కాదు.. ఆయనలో క్వాలిటీస్ చెప్పిన శామ్ పిట్రోడా

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... పాయకాపురంలో కొన్ని ప్రాంతాల్లో నీరు ఇంకా నిల్వ ఉందని అన్నారు. రేపు సాయంత్రానికి మొత్తం నీరు తగ్గిపోతుంవని చెప్పారు. నీరు తగ్గిన 24 గంటల్లోగా సాధారణ పరిస్థితి తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. వరద తగ్గిన ప్రాంతాల్లో రేపటి కల్లా శానిటేషన్ పూర్తి అవుతుందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.


ALSO READ:Heavy Rains: భారీ వర్షాలు.. బొర్రా గుహలు మూసివేత

ఇవాళ రాత్రికి చాలా ప్రాంతాల్లో శానిటేషన్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. మళ్లీ తిరిగి వర్షం రావడంతో కొంత పనులకు అంతరాయం కలిగిందని అన్నారు. డ్రైనేజ్ పనులపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నీరు నిల్వ ఉన్నప్పటికీ చెత్తను తొలగించకుంటే అంటు వ్యాధులు వస్తాయని తెలిపారు. అందుకే నీటిలో ఉన్న చెత్తను తొలగిస్తున్నామని అన్నారు. వైద్యారోగ్య శాఖతో కలిసి హెల్త్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.


జగన్ పాలనంతా కక్ష సాధింపుతోనే సాగింది: మంత్రి బీసీ జనార్దన్

jana.jpg

నంద్యాల: జగన్ పాలనంతా కక్ష సాధింపుతోనే సాగిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి మరిచి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి రాక్షసంగా హింసించారని మంత్రి బీసీ జనార్దన్ ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటూ ప్రజల కోసం కష్టపడే నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.


అవినీతి మచ్చలేని చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టి రాక్షసానందాన్ని జగన్ పొందారని విమర్శించారు. జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మిన ప్రజలు కూటమికి 164 సీట్లు ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించారని మంత్రి బీసీ జనార్దన్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: ప్రజల కోసమే నా జీవితం అంకితం

AP Rains: అంతిమయాత్రకు తప్పని వరద కష్టాలు

Hyderabad: పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు..

Heavy Rains: భారీ వర్షాలు.. బొర్రా గుహలు మూసివేత

Read LatestAP News And Telugu News

Updated Date - Sep 09 , 2024 | 10:15 PM