Share News

CAA: సీఏఏ అమలుపై 200 పిటిషన్లు.. విచారించనున్న సుప్రీంకోర్టు

ABN , Publish Date - Mar 19 , 2024 | 10:41 AM

పౌరసత్వ సవరణ చట్టం అమలుపై కొన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సీఏఏను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం నాడు విచారణ చేపట్టనుంది. సీఏఏ అమలు, పౌరసత్వ సవరణ నిబంధనలు 2024పై 200కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ఈ రోజు విచారణ జరగనుంది.

CAA: సీఏఏ అమలుపై 200 పిటిషన్లు.. విచారించనున్న సుప్రీంకోర్టు

ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై కొన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సీఏఏను (CAA) సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం నాడు విచారణ చేపట్టనుంది. సీఏఏ (CAA) అమలు, పౌరసత్వ సవరణ నిబంధనలు 2024పై 200కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ఈ రోజు విచారణ జరగనుంది.

అభ్యంతరం

కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ గతవారం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. లోక్ సభ ఎన్నికల వేళ వివాదాస్పద చట్టం అమలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మతం ఆధారంగా సీఏఏ అమలు చేస్తున్నారని, ప్రత్యేకించి ముస్లింలపై వివక్ష చూపుతుందని ఇతర పిటిషనర్లు పేర్కొన్నారు. మతపర విభజన వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం వారి హక్కులను ఉల్లంఘించడం అవుతోందని చెబుతున్నారు.

పిటిషన్లు ఇవే..

తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా, కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, అసోం కాంగ్రెస్ నేత దేబబ్రత సైకియా, ఎన్జీవో రిహయ్ మంచ్ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ముస్లింలు తప్ప

2014 డిసెంబర్ 31కి ముందు బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్దులు, పార్సీ, క్రిస్టియన్లకు భారతదేశ పౌరసత్వం కల్పిస్తారు. నాలుగేళ్ల క్రితం పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌లో చట్టంగా మారింది. ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం నియమ, నిబంధలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ముస్లింలు తప్ప మిగతా మతాలకు చెందిన వారికి పౌరసత్వం కల్పిస్తారు. ముస్లిం ప్రతినిధులు, ఇతరులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 10:47 AM