Share News

Lok Sabha Polls: హోరాహోరీలో గెలిచేదెవరు.. మెజార్టీ సీట్ల కోసం పార్టీల ప్రయత్నాలు..

ABN , Publish Date - May 22 , 2024 | 11:21 AM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరు దశల పోలింగ్ ముగిసింది. మరో రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. మే25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్‌తో దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. జూన్4న ఓట్ల లెక్కింపుతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఆరో దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనుండగా.. గత ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది.

Lok Sabha Polls: హోరాహోరీలో గెలిచేదెవరు.. మెజార్టీ సీట్ల కోసం పార్టీల ప్రయత్నాలు..
Modi and Rahul

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరు దశల పోలింగ్ ముగిసింది. మరో రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. మే25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్‌తో దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. జూన్4న ఓట్ల లెక్కింపుతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఆరో దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనుండగా.. గత ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ద్వారా గతంలో సాధించిన సీట్లకంటే ఎక్కువ గెలుపొందేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు బీజేపీని కట్టడిచేసేందుకు ఇండియా కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. బీజేపీకి 200 సీట్లు దాటకుండా కట్టడి చేయాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ను 50 సీట్లలోపే కట్టడి చేయాలనే మాస్టర్ ప్లాన్‌లో బీజేపీ ఉంది. ఇప్పటివరకు జరిగిన ఐదు దశల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శన గొప్పగా లేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఐదు దశల ఎన్ని్కల్లో కాంగ్రెస్ ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరో దశ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎవరి బలం ఎంతో తెలుసుకుందాం.

PM Modi: 'ఇండి' కూటమి పాపాలతో దేశం పురోగమించ లేదు: మోదీ


యూపీలో గట్టి పోటీ

ఆరో దశలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, ఫుల్‌పూర్, ప్రయాగ్‌రాజ్, అంబేద్కర్‌నగర్, శ్వస్తీ, దుమ్రియాగంజ్, బస్తీ, సంత్ కబీర్‌నగర్, లాల్‌గంజ్, జాన్‌పూర్, అజంగఢ్, ఫిష్ సిటీ, భదోహి లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2019లో బీజేపీ 9 సీట్లు, బీఎస్పీ 4, ఎస్పీ ఒక సీటు గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయగా.. ఈసారి కాంగ్రెస్, ఎస్పీ కలిసి పోటీచేస్తున్నాయి. బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగింది. ఎస్పీ ఈసారి కొత్త సమీకరణంతో ఎన్నికల బరిలోకి దిగింది. అఖిలేష్ యాదవ్ ఈసారి దళిత, ఓబీసీ ఓటర్లపై ఫోకస్ పెట్టారు. ఈ వర్గాల ఓట్లను పొందడం ద్వారా యూపీలో బీజేపీ స్పీడ్‌కు బ్రేకులు వేయాలనే ఆలోచనలో అఖిలేష్ ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను తిరిగి సాధించడం బీఎస్పీకి అతిపెద్ద సవాల్ కానుంది. ఇండియా, ఎన్డీయే కూటమి మధ్య హోరాహోరీగా సాగుతున్న పోరులో బీఎస్పీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు మోదీ, యోగీ చరిష్మాతో పూర్వాంచల్‌లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.


బీహార్, జార్ఖండ్‌లో..

బీహార్‌లోని వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, శివర్, వైశాలి, గోపాల్‌గంజ్, మహారాజ్‌గంజ్, సివాన్ స్థానాలకు ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి. 2019లో బీజేపీ నాలుగు, జేడీయూ మూడు, ఎల్‌జేపీ ఒక సీటు గెలుచుకున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్‌ ఈ స్థానాల్లో తమ ఖాతాను తెరవలేకపోయాయి. ఈసారి పోటీ భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్య ప్రధాన నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయేకు తమ సీట్లు కాపాడుకోవడం పెద్ద సవాల్‌గా మారింది.

జార్ఖండ్‌లోని గిరిడి, ధన్‌బాద్, రాంచీ, జంషెడ్‌పూర్ స్థానాలకు ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది.


బెంగాల్, ఒడిశాలో

పశ్చిమ బెంగాల్‌లోని 8 లోక్‌సభ స్థానాలకు, ఒడిశాలోని 6 లోక్‌సభ స్థానాలకు ఆరో దశలో ఎన్నికలు జరుగనున్నాయి. బెంగాల్‌లోని తమ్లుక్, కాంతి, ఘటల్, ఝర్‌గ్రామ్, మెద్నీపూర్, పుర్లియా, బంకురా, బిష్ణుపూర్ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. 2019లో ఈ 8 సీట్లలో బీజేపీ 5 సీట్లు గెలుచుకోగా, టీఎంసీ మూడు సీట్లు గెలుచుకుంది. ఒడిశాలోని సంబల్‌పూర్, కెంజోర్, ధెంకనల్, కటక్, పూరి, భునేశ్వర్ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లు గెలుచుకోగా, బీజేడీకి నాలుగు సీట్లు గెలుపొందింది. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా రెండింటిలోనూ బీజేపీ తన సీట్లను గతంతో పోలిస్తే పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బెంగాల్‌లో బీజేపీ టీఎంసీతో, ఒడిశాలో బీజేడీతో ప్రధాన పోటీని ఎదుర్కొంటుంది.


ఢిల్లీ, హర్యానాలో..

ఆరో దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు, హర్యానాలోని మొత్తం పది లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. దీంతో మరోసారి ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేయడం బీజేపీకి కష్టతరంగా మారింది. బీజేపీ ఏడుగురు సిట్టింగ్ ఎంపీల్లో ఆరుగురికి టికెట్లు నిరకారించింది. వారి స్థానంలో కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఎంపీ మనోజ్‌ తివారీకి మాత్రమే తిరిగి టికెట్ కేటాయించింది. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ కన్హయ్య కుమార్‌ను రంగంలోకి దించడం ద్వారా పోటీని ఆసక్తికరంగా మార్చింది. ఢిల్లీలోని ఏడు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తోంది.


Lok Sabha elections 2024: ఐదో దశలో తగ్గిన పోలింగ్ శాతం.. 2019తో పోలిస్తే తగ్గిందా, పెరిగిందా?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest National News and Telugu News

Updated Date - May 22 , 2024 | 12:01 PM