Share News

Viral Video: దండ వేయడం అంత ఈజీ కాదు.. వధువు నిర్వాకానికి అవాక్కైన వరుడు..

ABN , Publish Date - Nov 28 , 2024 | 07:45 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ వేడుకలో వధూవరుల మధ్య తమాషా సంఘటన చోటు చేసుకుంది. వరమాల కార్యక్రమం సందర్భంగా బంధువుల సమక్షంలో వధూవరులు దండలు మార్చుకున్నారు. ముందుగా..

Viral Video: దండ వేయడం అంత ఈజీ కాదు.. వధువు నిర్వాకానికి అవాక్కైన వరుడు..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ మారుమూల ప్రాంతంలో వివాహం జరిగినా.. అందుకు సంబంధించిన ఏదో ఒక వీడియో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. వాటిలో వినూత్నంగా ఉన్న వీడియోలు ఇట్టే వైరల్ అవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది తమ వివాహాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కొన్నిసార్లు వధూవరులు చేసే పనులు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దండ వేస్తున్న వరుడు.. వధువు నిర్వాకానికి అవాక్కయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘దండ వేయడం అంత ఈజీ కాదు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) వేడుకలో వధూవరుల (bride and groom) మధ్య తమాషా సంఘటన చోటు చేసుకుంది. వరమాల (Varamala) కార్యక్రమం సందర్భంగా బంధువుల సమక్షంలో వధూవరులు దండలు మార్చుకున్నారు. ముందుగా వరుడి మెడలో వధువు దండ వేసింది. ఆ తర్వాత వరుడు కూడా వధువు మెడలో దండ వేసేందుకు సిద్ధమయ్యాడు.

Optical illusion: ఈ పార్క్‌లో దాక్కున్న పులిని.. 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. తీరా వరుడు దండ వేసే సమయంలో వధువు వెనక్కు వంగింది. అయినా వరుడు దండ వేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో వధువు పూర్తిగా వెనక్కు వంగి వరుడికి పెద్ద పరీక్ష పెట్టింది. వధువు అలా పూర్తిగా కిందకు వంగడంతో దండ వేయడం వరుడికి ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత వధువు మళ్లీ పైకి నిలబడి వరుడిని కౌగిలించుకుని తన ప్రేమను వ్యక్తం చేస్తుంది.

Viral Video: పులికి సింహం షాక్ .. పందిని ఎలా సేవ్ చేసిందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..


ఇలా దండ వేసే సమయంలో వధువు చేసిన నిర్వాకంతో అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వధువు విన్యాసాలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘వరుడికి పెద్ద పరీక్షే పట్టిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: దాడి చేయడానికి వచ్చిన పులి.. సమీపానికి రాగానే సడన్ షాక్ ఇచ్చిన రైతు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 28 , 2024 | 07:45 AM