Share News

Viral Video: సింహాన్ని చూసి పొదల్లో దాక్కున్న గేదె.. మధ్యలో దోమలు చేసిన నిర్వాకంతో.. చివరకు..

ABN , Publish Date - Oct 09 , 2024 | 04:29 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పెద్ద సింహం.. వేట కోసం ఎదురు చూస్తుండగా గేదె కనిపిస్తుంది. ఇంకేముందీ.. గేదెను చూడగానే దానిపైకి దూకుతుంది. అయితే సింహం దాడి చేయడాన్ని గమనించిన గేదె భయంతో పొదల్లో దాక్కుంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది..

Viral Video: సింహాన్ని చూసి పొదల్లో దాక్కున్న గేదె.. మధ్యలో దోమలు చేసిన నిర్వాకంతో.. చివరకు..

పులులు, సింహాల వేటలో అప్పుడప్పుడు సినిమా తరహా ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు నోటి దాకా వచ్చిన వేట.. ఉన్నట్టుండి చేజారిపోతుంటుంది. మరికొన్నిసార్లు చిన్న చిన్న జంతువలు కూడా తిరుగుబాటు చేసి తప్పించుకుంటుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, సింహం, గేదెకు సంబంధిచిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ గేదె సింహాన్ని చూసి భయంతో పొదల్లో దాక్కుంది. అయితే చివరకు దోమలు చేసిన నిర్వాకంతో ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పెద్ద సింహం.. వేట కోసం ఎదురు చూస్తుండగా గేదె కనిపిస్తుంది. ఇంకేముందీ.. గేదెను చూడగానే (Lion attack on buffalo) దానిపైకి దూకుతుంది. అయితే సింహం దాడి చేయడాన్ని గమనించిన గేదె భయంతో పారిపోయి (buffalo hiding in the bushes) పొదల్లో దాక్కుంటుంది. దాన్ని వెంటపడుతూ వెళ్లిన సింహం.. పొదల్లో కనిపించకపోయే సరికి అక్కడే నిలబడి అటూ, ఇటూ చూస్తుంటుంది.

Viral Video: ఇది మరీ టూమచ్ భయ్యా.. ఇతను చేస్తున్న డేంజరస్ స్టంట్ చూస్తే.. నోరెళ్లబెడతారు..


కాస్త దూరంలో నిలబడిన గేదె.. సింహం కదలికలను గమనిస్తూ దాక్కుని ఉంటుంది. సింహం దాడి నుంచి తప్పించుకుందిలే.. అని అనుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. పొదల్లోని దోమలు గేదెను చుట్టేయడంతో తలను అటూ, ఇటూ తిప్పుతుంది. ఇలా మళ్లీ మళ్లీ చేయడంతో సింహం పసిగట్టేస్తుంది. వెంటనే గేదె పైకి మళ్లీ దాడి చేస్తుంది. ఈ సారి తప్పించుకోవాలని గేదె ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సింహం పంజా దాటికి నేలపై చతికిలపడిపోతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: కోబ్రాల మధ్య భయంకర యుద్ధం.. చివరకు ఓ పాము ఎలా గెలిచిందో చూస్తే..


ఈ ఘటన చూస్తుంటే.. సింహం దాడిలో గేదె ప్రాణాలు కోల్పోయినట్లు కనిపిస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘గేదె చేసిన పొరపాటుతో ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘గెదెను చూస్తుంటే జాలేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 53 వేలకు పైగా లైక్‌లు, 1.4 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 09 , 2024 | 04:29 PM