Share News

Viral Video: రోడ్డుపై ఠీవీగా నడుస్తున్న సింహం.. రెండు వైపులా మోహరించిన జనాలు.. చివరకు..

ABN , Publish Date - Aug 31 , 2024 | 08:23 PM

ఏనుగులు, పులులు, సింహాలు కొన్నిసార్లు అటవీ ప్రాంతాల్లోకి చొరబడడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సమయాల్లో అప్పడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: రోడ్డుపై ఠీవీగా నడుస్తున్న సింహం.. రెండు వైపులా మోహరించిన జనాలు.. చివరకు..

ఏనుగులు, పులులు, సింహాలు కొన్నిసార్లు అటవీ ప్రాంతాల్లోకి చొరబడడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సమయాల్లో అప్పడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. గ్రామంలోకి చొరబడిన సింహం రోడ్డుపై ఠీవీగా నడుస్తూ ఉండగా.. రోడ్డుకు రెండు వైపులా జనం వాహనాల్లో నిలబడి ఉన్నారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని (Gujarat) గిర్ ప్రాంత పరిధిలోని గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ సింహం అటవీ ప్రాంతం నుంచి సమీప గ్రామంలోకి వచ్చేసింది. సింహాన్ని చూసిన జనం భయంతో పరుగులు తీయడం మొదలెట్టారు. చివరకు ఆ సింహం (lion) గ్రామంలోని రోడ్డుపైకి చేరుకుంది.

Viral Video: పిచ్చి పీక్స్‌కు వెళ్లడమంటే ఇదే.. ఈ యువతి అత్యుత్సాహంతో చివరకు ఏమైందంటే..


ఈ క్రమంలో రోడ్డుపై రెండు వైపులా జనాలు గుమికూడారు. కొందరు బైకులు ఆపుకొని మరీ సింహాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. వారిని చూసిన సింహం ఎంతో ఠీవీగా నడుచుకుంటూ వస్తోంది. చాలా మంది యువకుడు సింహాన్ని వీడియోలు తీసుకుంటూ పరుగులు పెట్టారు. ఇలా చాలా సేపు ఆ సింహం అక్కడే నిలబడి అటూ ఇటూ నడుస్తూ కనిపించింది. చివరగా రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి పారిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: వాటర్ బాటిల్‌తో రోడ్డు పక్కకు వెళ్లి.. ఈ యువతి చేసిన పనికి అంతా షాక్..


ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగనట్లు తెలిసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహం ఎక్కడైనా సింహమే’’.. అంటూ కొందరు, ‘‘అడవులు తరిగిపోతుండడంతో జంతువులన్నీ ఇలా గ్రామాల్లోకి చొరబడుతున్నాయ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1800కి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పర్‌ఫెక్ట్ ఫోకస్ అంటే ఏంటో ఈ జింకను చూసి నేర్చుకోవాల్సిందే.. నీళ్లు తాగుతూ అది చేసిన పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 31 , 2024 | 08:23 PM