Share News

Viral Video: నిర్లక్ష్య ఫలితం ఎలా ఉంటుందో తెలుసా.. ఈ యువకుడు చేసిన నిర్వాకంతో.. ఏమైందో చూడండి..

ABN , Publish Date - Oct 16 , 2024 | 09:07 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. పనిలో పనిగా రీల్స్ చేసి ఫేమస్ అవ్వాలని అనుకున్నాడు. అయితే ఇందుకోసం చాలా మార్గాలు ఉన్నా.. ఇతను మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. డోరు వద్ద నిలబడి ..

Viral Video: నిర్లక్ష్య ఫలితం ఎలా ఉంటుందో తెలుసా.. ఈ యువకుడు చేసిన నిర్వాకంతో.. ఏమైందో చూడండి..

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశం మంచిదే అయినా.. అందుకోసం చేసే ప్రయత్నాలు సక్రమంగా ఉండాలి. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల చివరకు అసలుకే ఎసరు వస్తుంది. ఈ విషయం తెలిసినా చాలా మంది తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇటీవల బస్సు, రైలు ప్రయాణాల్లో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తున్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. రైల్లో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ఓ యువకుడి పరిస్థితి చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. పనిలో పనిగా రీల్స్ చేసి ఫేమస్ అవ్వాలని అనుకున్నాడు. అయితే ఇందుకోసం చాలా మార్గాలు ఉన్నా.. ఇతను మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. డోరు వద్ద నిలబడి బయటికి వేలాడుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. తరచూ అటూ, ఇటూ తిరుగుతూ స్తంభాలతో ఆటలు ఆడాడు. మధ్యలో మధ్యలో డాన్సులు వేస్తూ వెకిలిచేష్టలు కూడా చేశాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే.. గేదెల వద్ద ఏం చేస్తున్నాడో చూడండి..


డోరు వద్ద వేలాడుతున్న అతను.. కాసేపటి తర్వాత మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. బయటి వైపు స్తంభాలను పట్టించుకోకుండా (boy hanging from moving train door) రైలుకు వేలాడుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా స్తంభం తగిలి ధబేల్‌మని పక్కనే ఉన్న రైల్వే ట్రాకులపై పడిపోయాడు. దీంతో అంతవరకూ అతన్ని వీడియో తీస్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. తర్వాత అతడి పరిస్థితి ఏమైందో తెలియరాలేదు.

Viral Video: గుడిలో భజనలు చేస్తుండగా.. కిటికీ పక్కన షాకింగ్ సీన్.. ఈమెకు ఏం జరిగిందంటే..


అయితే ప్రమాద తీవ్రత చూస్తుంటే అతను తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకున్నాడు’’.. అంటూ కొందరు, ‘‘ఇలా తెలిసి తెలిసి తప్పులు చేయడం దారుణం’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు ఎవరూ చేయొద్దు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బైకుపై మందుబాబు.. మార్గమధ్యలో అతడి తిప్పలు చూస్తే.. పగలబడి నవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 16 , 2024 | 09:11 AM