Share News

Viral Video: బాంబులా మారిన టైరు.. గాలి నింపుతుండగా.. మైండ్ బ్లాకింగ్ సీన్.. చివరకు చూస్తుండగానే..

ABN , Publish Date - Nov 28 , 2024 | 09:29 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కారు టైరు పంక్షర్ కావడంతో ఓ వ్యక్తి పంక్షర్ షాపు వద్దకు వెళ్తాడు. షాపులో పని చేసే వ్యక్తి కారు టైరును విప్పి పంక్షర్ వేస్తాడు. ఆ తర్వాత టైరుకు గాలి పట్టేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో అతను టైరుపై కూర్చుని గాలి పడుతుంటాడు. ఈ సమయంలో..

Viral Video: బాంబులా మారిన టైరు.. గాలి నింపుతుండగా.. మైండ్ బ్లాకింగ్ సీన్.. చివరకు చూస్తుండగానే..

కారులో జర్నీ చేయడం వల్ల ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో.. కొన్నిసార్లు అంతే ఇబ్బందిగా కూడా మారొచ్చు. మరికొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా మారొచ్చు. అవగాహన లేకుండా వాహనాలు నడుపుతూ కొందరు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరికొందరు ప్రమాదాల బారిన పడడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కారు టైరుకు గాలి పడుతుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కారు టైరు పంక్షర్ కావడంతో ఓ వ్యక్తి పంక్షర్ షాపు వద్దకు వెళ్తాడు. షాపులో పని చేసే వ్యక్తి కారు టైరును విప్పి పంక్షర్ వేస్తాడు. ఆ తర్వాత టైరుకు గాలి పట్టేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో అతను టైరుపై కూర్చుని గాలి పడుతుంటాడు. ఈ సమయంలో ఉన్నట్లుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.

Optical illusion: ఈ పార్క్‌లో దాక్కున్న పులిని.. 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఒక్కసారిగా టైరు కాస్తా.. బాంబులా (Car tire burst) పేలిపోతుంది. దీంతో టైరుపై కూర్చున్న వ్యక్తి గాల్లోకి ఎగిరి కారుకు అటువైపు రోడ్డుపై ధబేల్‌మని కిందపడిపోతాడు. టైరు పేలడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. కొందరు పరుగెత్తుకుంటూ అతడి వద్దకు వెళ్లి పైకి లేపే ప్రయత్నం చేస్తారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. చూస్తుంటే ఈ ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.

Viral Video: వరుడు చూస్తుండగానే వధువు పక్కన స్నేహితుడి డాన్స్.. చివరకు ఆమె రియాక్షన్ చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి టైం బాగుంది.. ప్రాణాలతో బయటపడ్డాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా లైక్‌లు, 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దండ వేయడం అంత ఈజీ కాదు.. వధువు నిర్వాకానికి అవాక్కైన వరుడు..


ఇవి కూడా చదవండి..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 28 , 2024 | 09:29 AM