Viral Video: వాహనాలకు గ్యాస్ నింపుతున్నారా.. ఇతడికి ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Dec 20 , 2024 | 01:34 PM
ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో గ్యా్స్ వాహనాల వినియోగం పెరిగిపోతోంది. స్కూటర్లు దగ్గర నుంచి ఆటోలు, కార్లు ఇలా చాలా వాహనాలు గ్యాస్‌తో నడవడం చూస్తున్నాం. అయితే ఇలాంటి వాహనాలకు గ్యాస్ నింపే క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలు జరగడం చూస్తుంటాం. ఇలాంటి..
ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో గ్యా్స్ వాహనాల వినియోగం పెరిగిపోతోంది. స్కూటర్లు దగ్గర నుంచి ఆటోలు, కార్లు ఇలా చాలా వాహనాలు గ్యాస్‌తో నడవడం చూస్తున్నాం. అయితే ఇలాంటి వాహనాలకు గ్యాస్ నింపే క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలు జరగడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వాహనాలకు గ్యాస్ నింపే సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పూణేలోని (Pune) చావన్‌నగర్‌లోని హట్టి చౌక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సీఎన్‌జీ బంకు వద్ద (CNG station) వాహనాలకు గ్యాస్ నింపే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడున్న ఉన్న సిబ్బందిలో ఓ వ్యక్తి.. సీఎన్‌జీ బైకుకు గ్యా్స్ నింపే క్రమంలో పైపును చేతిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తాడు.
Viral Video: చిరుతకు షాక్ ఇచ్చిన కుందేలు.. పట్టుకోవాలని ప్రయత్నించగా చివరకు ఏం జరిగిందో చూడండి..
అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. గ్యాస్ నాజిల్ ఊడిపోవడంతో పైపు నుంచి గ్యాస్ మొత్తం లీకవుతుంది. గ్యాస్ ఒక్కసారిగా బయటికి రావడంతో అక్కడున్న సిబ్బందికి కంటికి పైపు తగులుకుంది. దీంతో అతను ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే అతడి వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి కాపాడే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రమాదంలో అతడి కన్ను పోయినట్లు తెలిసింది.
Viral Video: చలిలో ఆటో నడుపుతూ ఇతను చేసిన నిర్వాకం చూస్తే.. పగలబడి నవ్వుతారు..
కాగా, ఈ ప్రమాద ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సీఎన్‌జీ బైకులతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘సీఎన్‌జీ బంకులో పని చేసేటప్పుడు హెల్మెట్ ధరిస్తే మంచింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1500కి పైగా లైక్‌లు, 2.35 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: స్కూటీపై వస్తూ ఏనుగును ఢీకొన్న యువతి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..