Share News

Viral Video: వామ్మో.. ఇలా తయారయ్యారేంట్రా.. ఆయిల్ ట్యాంకర్‌పై అందరికీ అనుమానం.. ఏముందా అని లోపల తొంగి చూడగా..

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:53 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. జాతీయ రహదారిపై ఓ ఆయిల్ ట్యాంకర్‌ను చూసి అంతా అవాక్కవుతున్నారు. ట్యాంకర్‌పై అనుమానం రావడంతో కొందరు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చివరకు అందులో పరిశీలిచంగా.. షాకింగ్ సీన్ కనిపించింది...

Viral Video: వామ్మో.. ఇలా తయారయ్యారేంట్రా.. ఆయిల్ ట్యాంకర్‌పై అందరికీ అనుమానం.. ఏముందా అని లోపల తొంగి చూడగా..

కాదేదీ కల్తీకి అనర్హం.. అన్న సామెత చందంగా కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. కొందరు అక్రమార్కులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వివిధ మార్గాల ద్వారా అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరి తెలివితేటలు చూస్తే చివరకు పోలీసులే ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇలాంటి వినూత్న సంఘటలనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆయిల్ ట్యాంకర్‌పై అనుమానం వచ్చి పరిశీలించిన పోలీసులకు.. అందులో షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వామ్మో.. ఇలా తయారయ్యారేంట్రా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బీహార్‌లో (Bihar) జరిగినట్లు తెలుస్తోంది. ముజఫర్‌పూర్ జాతీయ రహదారిపై ఓ ఆయిల్ ట్యాంకర్‌ను చూసి అంతా అవాక్కవుతున్నారు. ట్యాంకర్‌పై అనుమానం రావడంతో కొందరు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ట్యాంకర్‌ను వెంబడించారు. దీంతో డ్రైవర్, వ్యాపారి తమ వాహనాన్ని రోడ్డు పక్కన వదిలేసి పారిపోయారు.

Viral Video: దూడకు జన్మనిచ్చిన గేదె.. అంతలోనే చుట్టుముట్టిన సింహాలు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


తీరా ట్యాంకర్‌లో పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది. అందులో ఆయిల్‌కు బదులుగా (Liquor bottles in oil tanker) 200 బీరు బాక్సులను గుర్తించారు. అలాగే పలు మద్యం బాటిళ్లు కూడా బయటపడ్డాయి. వాటిని చూడగానే అంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ట్యాంకర్‌ను సీజ్ చేశారు. పట్టుబడిన మద్యం అరుణాచల్ ప్రదేశ్‌లో తయారైనట్లు పోలీసులు తెలిపారు. అక్రమరవాణాకు పాల్పడిన వ్యాపారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. బీహార్ మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి. దీంతో కొందరు అక్రమ మార్గాల ద్వారా మద్యాన్ని తరలిస్తున్నారు.

Viral Video: కారుపై ఎల్‌ఈడీ స్క్రీన్ పెట్టారనుకుంటే పొరపాటు పడ్డట్లే.. దగ్గరికి వెళ్లి చూస్తే షాకింగ్ సీన్..


ఈ క్రమంలో అనేక మంది అతి తెలివిగా ఆలోచిస్తూ మద్యాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. కాగా, ఆయిల్ ట్యాంకర్‌లో మద్యం బయటపడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. వీళ్ల ప్లానింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఆయిల్ ట్యాంకర్‌లో మద్యం తరలింపు.. ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొదరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: బైక్ అంటేనే భయం పుట్టేలా చేశాడుగా.. వెనుక కూర్చున్న ఈ యువతి పరిస్థితి చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 23 , 2024 | 01:53 PM