Share News

Viral Video: నిద్రపోతున్న మహిళ జుట్టులోకి దూరిన పాము.. చివరకు..

ABN , Publish Date - Jul 31 , 2024 | 09:37 PM

పాములు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో.. ఏ వస్తువుల నుంచి బయటికి వస్తాయో చెప్పలేని పరిస్థితి. కొన్నిసార్లు సీలింగ్ ఫ్యాన్లపై కనిపిస్తే.. మరికొన్నిసార్లు ఫ్రిడ్జి వెనువ వైపు నుంచి బయటికి వస్తాయి. అలాగే..

Viral Video: నిద్రపోతున్న మహిళ జుట్టులోకి దూరిన పాము.. చివరకు..

పాములు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో.. ఏ వస్తువుల నుంచి బయటికి వస్తాయో చెప్పలేని పరిస్థితి. కొన్నిసార్లు సీలింగ్ ఫ్యాన్లపై కనిపిస్తే.. మరికొన్నిసార్లు ఫ్రిడ్జి వెనువ వైపు నుంచి బయటికి వస్తాయి. అలాగే మరికొన్నిసార్లు షూలలో నుంచి బుసలు కొడుతూ బయటికి వచ్చి పడగ విప్పుతుంటాయి. అలాగే అప్పుడప్పుడూ మనుషుల చొక్కాల్లోకి, ఫ్యాంట్లలోకి దూరిపోతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ నిద్రపోతుండగా.. ఓ పాము ఉన్నట్టుండి ఆమె తలలోకి దూరింది. చివరకు ఏమైందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ గాఢనిద్రలో ఉండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. పడుకుని ఉన్న ఆమె తల వద్దకు ఓ పాము మెల్లగా పాక్కుంటూ వస్తుంది. చివరకు ఆ పాము ఆమె తలపైకి ఎక్కుతుంది. అంతటితో ఆగకుండా చివరకు (snake crawled into woman's hair) ఏకంగా ఆమె జుట్టులోకి దూరిపోతుంది.

Viral Video: నీటి గుర్రం పవరేంటో తెలీక ఒక్కసారిగా చుట్టుముట్టిన సింహాలు.. చివరకు ఏమైందంటే..


తలలో ఏదో పాకుతున్నట్లు అనిపించడంతో ఆమెకు మెలకువ వస్తుంది. ఉన్నట్టుండి ఉలిక్కిపడి తలపై చేయి పట్టి చూసుకుంటుంది. చివరకు పాము రావడాన్ని చూసి షాక్ అవుతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. అయితే ఈ ఘటన మొత్తం చూస్తుంటే.. వ్యూస్, లైక్‌ల కోసం ఆ పామును కుటుంబ సభ్యులు కావాలనే వదిలినట్లు అనిపిస్తోంది. అయినా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: పేరుకే ఎలిగేటర్..ఈ యువతి చేయి వేయగానే.. ఏం చేసిందో చూడండి..


ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి ప్రయోగాలు చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘రీల్సో కోసం మరీ ఇలాంటి పనులు చేయడం ఏంటో’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది పెంపుడు పాము, విషం లేనిది. వ్యూస్ కోసం పామును కావాలనే ఇలా తలలోకి వదిలారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కారు మైలేజీ పెంచేందుకు ఇంజిన్‌లో ఇతను చేసిన మార్పు చూస్తే.. మతిపోవాల్సిందే..

Updated Date - Jul 31 , 2024 | 09:42 PM