Share News

Viral Video: పేరుకే ఎలిగేటర్..ఈ యువతి చేయి వేయగానే.. ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Jul 31 , 2024 | 07:52 PM

ప్రమాదకర జీవులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఏకంగా మనుషులతో స్నేహం కూడా చేస్తుంటాయి. ఇలాంటి ...

Viral Video: పేరుకే ఎలిగేటర్..ఈ యువతి చేయి వేయగానే.. ఏం చేసిందో చూడండి..

ప్రమాదకర జీవులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఏకంగా మనుషులతో స్నేహం కూడా చేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి పెద్ద ఎలిగేటర్ వద్దకు రాగానే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తలపై చేయి వేయగానే ఉన్నట్టుండి అది ప్రవర్తించిన తీరు చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి మొసళ్లు, ఎలిగేటర్లు ఉన్న నీటి కుంట వద్దకు వెళ్తుంది. ఒడ్డున కూర్చోగానే నీటిలో నుంచి ఓ పెద్ద ఎలిగేటర్ ఒడ్డుకు వస్తుంది. నోరు తెరచి యువతి సమీపానికి వెళ్తుంది. దీంతో చివరకు యువతి ఎలిగేటర్ తలపై చేయి పెట్టి మృదువుగా నిమురుతుంది. దీంతో వెంటనే అంత పెద్ద ఎలిగేటర్ కూడా చిన్న పిల్లాడిలా మారిపోతుంది.

Viral Video: వామ్మో..! చిన్న పిల్లలను టార్గెట్ చేసిన గేదె.. చూస్తుండగానే ఇలా చేసిందేంటీ..


ఆకలితో ఉన్న పిల్లాడు తల్లి వద్ద ఎలా ప్రవర్తిస్తాడో.. అచ్చం అలాగే ఈ ఎలిగేటర్ కూడా యువతి వద్ద ప్రవర్తిస్తుంది. తనకు ఆహారం కావాలి అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. యువతి కూడా ఆ ఎలిగేటర్‌ను చిన్న పిల్లల తరహాలో.. ‘‘బుజ్జి... కన్నా.. ఎలా ఉన్నావ్’’.. అంటూ పలకరిస్తుంది. తర్వాత దాని ఆకలి బాధను అర్థం చేసుకుని.. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న మాంసం ముక్కను (young woman threw meat into the alligator mouth) తీసుకుని దాని నోట్లో విసురుతుంది. దీంతో ఆ ఎలిగేటర్.. ఎంచక్కా మాంసం ముక్కను నములుతూ ఆకలి తీర్చుకుంటుంది.

Viral Video: కుక్కపిల్లను పట్టుకున్న మొసలి.. రక్షించడానికి వెళ్లిన యజమాని.. చివరకు రజనీ స్టైల్లో..


ఈ యువతి ఎలిగేటర్ల సంరక్షణ బాధ్యతలు చూస్తుండడంతో అవి కూడా ఆమెతో కలిసిపోయినట్లు కనిపిస్తోంది. రోజూ మాంసం వేస్తుండడంతో యువతి రాగానే ఎలిగేటర్ ఎంతో ఆశగా వచ్చి.. అలా చిన్న పిల్లాడిలా ప్రవర్తించింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘యువతితో స్నేహితుడిగా మారిన ఎలిగేటర్’’.. అంటూ కొందరు, ‘‘అరే.. ఈ సీన్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 92 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: నీటిలో నుంచి ఒడ్డుకు చేరుకున్న జాగ్వార్.. సడన్‌గా తోక పట్టుకున్న మొసలి.. చివరకు..

Updated Date - Jul 31 , 2024 | 07:56 PM