Share News

Viral Video: వామ్మో..! చిన్న పిల్లలను టార్గెట్ చేసిన గేదె.. చూస్తుండగానే ఇలా చేసిందేంటీ..

ABN , Publish Date - Jul 31 , 2024 | 06:46 PM

ఎంతో సౌమ్యంగా ఉండే జంతువులు కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తింస్తుంటాయి. మరికొన్నిసార్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఏకంగా మనుషులపైనే దాడులకు దిగుతుంటాయి. ఇలాంటి ..

Viral Video: వామ్మో..! చిన్న పిల్లలను టార్గెట్ చేసిన గేదె.. చూస్తుండగానే ఇలా చేసిందేంటీ..

ఎంతో సౌమ్యంగా ఉండే జంతువులు కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తింస్తుంటాయి. మరికొన్నిసార్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఏకంగా మనుషులపైనే దాడులకు దిగుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ గెదె రోడ్డుపై వెళ్తున్న చిన్న పిల్లలపై దాడికి దిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై చిన్న పిల్లలు నడుస్తూ వెళ్తుండగా.. కొన్ని గేదెలు అటువైపుగా వస్తాయి. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో గానీ.. వాటిలో ఓ గేదెకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది. ఎదురుగా వెళ్తున్న (Buffalo attack on children) చిన్నారులపై దాడికి దిగింది. దీంతో పిల్లలు ఎగిరి అక్కడే ఉన్న ఓ దుకాణం ముందు పడిపోయారు.

Viral Video: ఈమె అతి తెలివికి దండం పెట్టొచ్చు.. వాషింగ్ మెషిన్‌ను ఎలా వాడిందో చూస్తే..


అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి చిన్నారిని కాపాడి ఇంట్లోకి తీసుకెళ్తాడు. అయితే అంతటితో ఆగని ఆ గేదె మరో చిన్నారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆ పక్కనే ఉన్న ఓ మహిళ పిల్లాడిని లాక్కుని పక్కకు తీసుకెళ్తుంది. అలాగే ఆ పక్కనే ఉన్న మరో బాలుడిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఆ బాలుడు కూడా చాకచక్యంగా ఆ గేదె నుంచి తప్పించుకుంటాడు. కాసేపటికి ఆ గేదెలన్నీ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతాయి. అయితే ఈ దాడిలో చిన్నారులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.

Viral Video: కుక్కపిల్లను పట్టుకున్న మొసలి.. రక్షించడానికి వెళ్లిన యజమాని.. చివరకు రజనీ స్టైల్లో..


సమయానికి చుట్టు పక్కల వారు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా, ఈ సంఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో ఈ గేదెలేంటీ ఇంత కోపంగా ఉన్నాయి’’.. అంటూ కొందరు, ‘‘గేదెలను ఇలా రోడ్డుపైకి వదిలిన వాళ్లపై చర్యలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: నీటిలో నుంచి ఒడ్డుకు చేరుకున్న జాగ్వార్.. సడన్‌గా తోక పట్టుకున్న మొసలి.. చివరకు..

Updated Date - Jul 31 , 2024 | 06:46 PM