Share News

TG Politics: బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు.. కారణమిదే..?

ABN , Publish Date - Jun 21 , 2024 | 05:54 PM

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy) ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ (BRS) నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 12 మంది నాయకులపై కేసు పెట్టారు. పోచారం ఇంటిదగ్గర గులాబీ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు.

TG Politics: బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు.. కారణమిదే..?

హైదరాబాద్: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy) ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ (BRS) నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 12 మంది నాయకులపై కేసు పెట్టారు. పోచారం ఇంటిదగ్గర గులాబీ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం ఉస్మానియా అస్పత్రికి తరలించారు. అనంతరం వారిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పోలీసుల తీరుపై సీరియస్ అయ్యారు. పోచారం ఇంటికి ఈ రోజు(శుక్రవారం) ఉదయం వెళ్లారు. ఈ సమయంలో పోలీసుల భద్రత చర్యల వైఫల్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.


సీఎం పోచారం ఇంట్లో ఉండగా అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు చొచ్చుకెళ్లారు. బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. పదుల సంఖ్యలో పోచారం ఇంట్లోకి గులాబీ శ్రేణులు చొరబడ్డారు. కారు పార్టీ కార్యకర్తల ఆందోళనలతో పోచారం ఇంటి దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ విషయంపై వెస్ట్ జోన్ డీఎస్పీ విజయ్ కుమార్ పోచారం ఇంటికెళ్లి విచారణ చేపట్టారు. బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ నేతలు చొరబడిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆ నేతలపై తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే పోచారం నివాసానికి సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ కూడా వెళ్లారు.

Updated Date - Jun 21 , 2024 | 05:55 PM