Share News

Bhatti Vikramarka: సారు కారు 16 నుంచి జీరోకి బీఆర్ఎస్

ABN , Publish Date - Jul 03 , 2024 | 06:11 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం దూరం అయినా ఆ పార్టీ నేతల వ్యవహార శైలి మారలేదని వివరించారు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీలో జీవిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సారు కారు 16 అన్నారు.. అలా అని జీరోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా ఊహాల్లోంచి బయటకు రావాలని కోరారు. బయటకు వస్తే వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తోందని సూచించారు.

Bhatti Vikramarka: సారు కారు 16 నుంచి జీరోకి బీఆర్ఎస్
Bhatti Vikramarka

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం దూరం అయినా ఆ పార్టీ నేతల వ్యవహార శైలి మారలేదని వివరించారు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీలో జీవిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సారు కారు 16 అన్నారు.. అలా అని జీరోకి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా ఊహాల్లోంచి బయటకు రావాలని కోరారు. బయటకు వస్తే వాస్తవ పరిస్థితి ఏంటో తెలుస్తోందని సూచించారు.


సంచలన ఆరోపణలు

తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. ఆ కుట్ర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుసు అని వివరించారు. ఆ కుట్రను సహించలేక వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరారని, మరింత మంది వస్తారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు చూసి ఎమ్మెల్యేలు వస్తున్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పు గురించి బీఆర్ఎస్ నేతలు సుద్దులు చెబుతున్నారు.. గతంలో ఏం జరిగిందని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను.. సీఎల్పీని విలీనం చేయలేదా అని నిలదీశారు.


లేదంటే పక్కన పెడతాం..

ఆదిత్యనాథ్ దాస్‌ను నీటిపారుదల శాఖ సలహాదారునిగా నియమించడంపై భట్టి విక్రమార్క స్పందించారు. ఆయన నీటి పారుదల రంగంలో నిపుణులు, అందుకే అడ్వైజర్‌గా నియమించుకున్నాం. ఒకవేళ ఆదిత్యనాథ్ మా అంచనాలు అందుకోకుంటే పక్కన పెడతాం అని తెగేసి చెప్పారు.

ఇవి కూడా చదవండి...

CM Chandrababu: అమరావతిలో ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News AND Telugu News

Updated Date - Jul 03 , 2024 | 06:12 PM