Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Jul 10 , 2024 | 12:52 PM

Latest News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమే ప్రత్యేకంగా ఈ లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఇక్కడే చూసేయండి.

Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-07-10T21:34:27+05:30

    రూ.5లక్షల చోరీ

    • తూప్రాన్ లో ఓ దాబా వద్ద ఆర్టీసీ బస్‌లో నుంచి రూ. 5 లక్షల చోరీ

    • బస్సులో నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న వ్యాపారి అబ్దుల్

    • తూప్రాన్‌లోని ఓ దాబాలో భోజనం కోసం బస్సు ఆపిన సమయంలో అబ్దుల్ బ్యాగ్ నుంచి డబ్బులు కొట్టేసిన దుండగులు

    • బాధితుని ఫిర్యాదుతో తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

  • 2024-07-10T21:03:16+05:30

    రాచకొండ సీపీ బాధ్యతల స్వీకరణ..

    • రాచకొండ సీపీగా సుధీర్ బాబు బాధ్యతల స్వీకరణ

    • రాచకొండ సిపి కార్యాలయం నేరడ్మెట్‌లో సీపీగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ బాబు

  • 2024-07-10T20:49:34+05:30

    ఏఎన్ఎంపై దాడి..

    • అనంతసాగరం మండలం మినగల్లు సచివాలయం ఏఎన్ఎం అరుణ పై దాడి.

    • కుటుంబ కలహాల నేపథ్యంలో దాడికి పాల్పడ్డ ఆర్టీసీ ఉద్యోగి ఈశ్వరయ్య.

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏఎన్ఎం అరుణ

    • నిందితుడు అరుణ బంధువుగా గుర్తింపు

  • 2024-07-10T20:25:42+05:30

    డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • అమరావతి: కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశం

    • కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయండి, అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలి

    • ప్రజలు తమ సమస్యలు తెలియచేసేందుకు రోజు రెండు గంటలు సమయం కేటాయించాలి

    • కాలుష్య మండలి వెబ్ సైట్‌లో వాయు, జల, శబ్ద కాలుష్యాల వివరాలను ప్రజలకు అవగాహన కలిగించే విధంగా పొందుపరచాలి

  • 2024-07-10T20:21:45+05:30

    విశాఖకు కేంద్రమంత్రి కుమార స్వామి

    • విశాఖ: ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి

    • స్టీల్ ప్లాంట్ విజిట్ కోసం విశాఖపట్టణం వచ్చాను

    • అధికార, కార్మిక సంఘాలతోపాటు ఎంపిక చేసిన అసోసియేయన్లతో ఆర్ఐఎన్ఎల్ స్థితిగతుల గురించి తెలుసుకుంటా

    • ప్లాంట్ పరిశీలన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తా: కేంద్రమంత్రి కుమారస్వామి

  • 2024-07-10T20:18:10+05:30

    రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు

    • సూర్యాపేట: రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు.

    • లబ్ధిదారులకు చేరేలా డీలర్స్, మిల్లర్స్ బాధ్యతగా ఉండాలి.

    • సూర్యాపేట జిల్లాలో గత వారం రోజుల నుంచి విసృత తనిఖీలు

    • 689 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్: సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్.

  • 2024-07-10T20:11:10+05:30

    అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి: పవన్ కల్యాణ్

    • అమరావతి: పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలు

    • అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి

    • కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదిక ఇవ్వండి

    • జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్ల భాగస్వామ్యం

    • కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమం

    • జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • 2024-07-10T20:07:55+05:30

    • ట్రైనీ ఐఏఎస్ అధికారి మానసిక వికలాంగురాలట..!!

    • ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా కేదర్‌ తాను మానసిక వికలాంగురాని అని యూపీఎస్సీ కమిషన్‌కు చెప్పింది.

    • ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించగా ఆరుసార్లు తప్పించుకుంది.

    • ఆమెకు ఎలా పోస్టింగ్ ఇచ్చారో అర్థం కావడం లేదు.

    • ఆడి కారుకు సైరెన్ పెట్టుకోవడంతో పూజాను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

  • 2024-07-10T19:38:34+05:30

    • కేంద్ర బృందం పర్యటన

    • ప్రకాశం: కొండపి, జరుగుమల్లి మండల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

    • ఉపాధి హామీ, జల్ జీవన్ మిషన్ పనుల పరిశీలన

  • 2024-07-10T19:36:03+05:30

    డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ నిర్వాకం

    • సూర్యాపేట: సూర్యాపేట మండలం బాలెం ఎస్సీ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నిర్వాకం

    • ప్రిన్సిపాల్ శైలజ గదిలో మద్యం సీసాలు

    • బాలెం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ.

    • ప్రిన్సిపాల్ శైలజను సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా

  • 2024-07-10T19:30:30+05:30

    పద్మశ్రీలకు చెక్కులు

    • హైదరాబాద్: సచివాలయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25లక్షల చెక్కులు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

    • రేవంత్ రెడ్డి చేతులమీదుగా చెక్కులు అందుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్ సోంలాల్.

    • చెక్కులు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.

  • 2024-07-10T19:23:36+05:30

    భారీగా గంజాయి స్వాధీనం

    • పల్నాడు జిల్లా: అమరావతి మండలం గిడుగు గ్రామం వద్ద పోలీసుల తనిఖీలు

    • 10 కేజీల గంజాయి స్వాధీనం, ముగ్గురి అరెస్ట్

    • కేసు నమోదు చేసిన అమరావతి పోలీసులు

  • 2024-07-10T19:19:59+05:30

    బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు

    • స్కూటీని ఢీ కొన్న మిహిర్ షా.. కావేరి అక్కడికక్కడే మృతి

    • ప్రమాదం తర్వాత గర్ల్ ఫ్రెండ్‌కు 40 సార్లు ఫోన్ చేసిన మిహిర్ షా

    • మిహిర్ షా గర్ల్ ఫ్రెండ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం

  • 2024-07-10T19:16:06+05:30

    స్టీల్‌‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సంచలన వ్యాఖ్యలు

    • విశాఖ: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం విత్ డ్రా మంత్రుల పరిధిలో ఉండే అంశం కాదు: ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ

    • ప్రధాని నాయకత్వంలో గల కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోవాలి.

    • సెయిల్‌లో విలీనం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. కొన్ని హద్దులు, అభ్యంతరాలు ఉన్నాయి

    • స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారం కోసం ఉన్న మార్గాలను పరిశీలిస్తాం.

  • 2024-07-10T19:10:44+05:30

    • బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం

    • మూడురోజుల పాటు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణమహోత్సవం

    • ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలు, పూలతో అందంగా రథం అలంకరణ, 1.6 కిలోమీటర్ల మేర రథోత్సవం

    • వెయ్యి మంది పోలీసులతో బందోబస్త్

    • రథోత్సవంలో పాల్గొననున్న హైదరాబాద్ ఇంఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్

    • తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కళాకారుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు

  • 2024-07-10T18:52:33+05:30

    తెలంగాణలో భారీగా మంది ఐపీఎస్‌ల బదిలీలు

    1. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్

    2. హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా

    3. టీజీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్

    4. గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర

    5. రాచకొండ కమిషనర్‌గా సుధీర్ బాబు

    6. ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి

    7. మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి

    8. రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా రమేష్ నాయుడు

    9. మల్టీ మల్టీజోన్ 2 ఐజీగా సత్యనారాయణ

    10. హైదరాబాద్ సీఆర్ హెడ్ కోటర్ డీసీపీగా రక్షితమూర్తి

    11. మెదక్ ఎస్పీగా డీ.ఉదయ్ కుమార్ రెడ్డి

    12. వనపర్తి ఎస్పీగా గిరిధర్

    13. ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి

    14. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్

  • 2024-07-10T18:50:47+05:30

    ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ ప్రముఖ కంపెనీకి సీఎం చంద్రబాబు ఆహ్వానం

    • ‘విన్‌ఫాస్ట్’ సీఈవో పంషాన్ చూతో చర్చలు జరిపానంటూ చంద్రబాబు ట్వీట్

    • వియత్నాంకు చెందిన ప్రధాన ఆటో మొబైల్ కంపెనీ ‘విన్‌ఫాస్ట్’

    • వారిని ఏపీలో ఈవీ, బ్యాటరీ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టాలని ఆహ్వానించాను

    • వారికి ఎక్కడ అనువైన ప్రదేశం ఉందో చూపే భాద్యతను పరిశ్రమల శాఖకు అప్పగించాం

    • వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం

  • 2024-07-10T18:18:57+05:30

    వివాహ భోజనంబు రెస్టారెంట్‌కు నోటీసులు

    • టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌ రెస్టారెంట్ 'వివాహ భోజనంబు' రెస్టారెంట్‌లో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు

    • ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన 25 కేజీల చిట్టిముత్యాల బియ్యం గుర్తింపు

    • నాసిరకం ఆహార పదార్థాలతో ఆహారం తయారీ

    • వండిన ఆహార పదార్థాలు ఫ్రీజ్‌లో నిల్వ, కిచెన్‌లో లేని పరిశుభ్రత

    • సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బెర గుర్తింపు.

  • 2024-07-10T17:33:33+05:30

    ఎంపీ బస్తిపాటి నాగరాజు

    • కర్నూలు: జిల్లా జైలును సందర్శించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

    • ఖైదీల్లో సత్ప్రవర్తన పెంపొందించేలా జైల్ అధికారులు కృషి చేయాలి

    • జైలు నిబంధనలకు అనుగుణంగా ఖైదీలకు సౌకర్యాలు కల్పించాలి: ఎంపీ బస్తిపాటి నాగరాజు

  • 2024-07-10T17:28:32+05:30

    భారీగా గంజాయి స్వాధీనం

    • నెల్లూరు: గంజాయి ముఠా సభ్యుల అరెస్ట్, రెండు కిలోల 200 గ్రాముల గంజాయి స్వాధీనం.

    • డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం పాటు పడుతుంది: ఏఎస్పీ సీహెచ్ సౌజన్య.

    • యువత మేలుకో - భవితని మలుచుకో - డ్రగ్స్‌ని వదులుకో పేరుతో టోల్ ఫ్రీ నెంబర్ 14500 ఏర్పాటు.

    • గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

    • గంజాయి సేవించినా, రవాణా చేసినా, సాగు చేసినా కఠిన చర్యలు.

    • గంజాయి కేసుల్లో శిక్షలు కఠినంగా ఉంటాయి. యువత జీవితాలని నాశనం చేసుకోవద్దని సూచన.

  • 2024-07-10T17:16:58+05:30

    తెలంగాణ డీజీపీగా జితేందర్

  • 2024-07-10T17:12:17+05:30

    జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్

    • విశాఖపట్నం: జీవీఎంసీ అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారు‌‌‌.

    • చట్టంలో ఉన్న లొసుగులు వాడుకొని అనుమతులు తీసుకున్నారు.

    • జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ సహకరించారు

    • 97 ఎకరాల 30 సెంట్లలో ఎన్సీసీ, కొప్పాకలో 2,761 చదరపు మీటర్ల భూమి, దారపాలెంలో 1,003 స్వ్కేర్ మీటర్ల స్థలం నిర్మాణానికి తన లాగిన్‌లో పెట్టుకుని కమిషనర్ డీమ్డ్ అప్రూవల్స్ ఇచ్చారు.

    • సాయికాంత్ వర్మ , రాజబాబు హయాంలో ఇచ్చిన టెండర్లు, టీడీఆర్ వెనక్కు తీసుకోవాలి.

    • వైసీపీ నేతలకు దోచిపెట్టిన కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

  • 2024-07-10T17:06:45+05:30

    ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

    • అమరావతి: ఉచిత ఇసుక పంపిణీపై నీలిమిడియా దుష్ప్రచారం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

    • వైసీపీ చేయలేని పనిని చంద్రబాబు చేశారని కడుపుమంట

    • వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భూబకాసురులుగా మారారు

    • ప్రస్తుతం లోడింగ్, రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ఉచితంగా ఇసుక సరఫరా

    • ఉచిత ఇసుకతో లక్షల మంది కార్మికులకు మేలు, నిర్మాణ రంగానికి ఊపిరి

    • వైసీపీ అబద్ధాలను నిజాలు చేయాలని చూస్తోంది. వైసీపీ భవిష్యత్ లేని పార్టీ, ఆ పార్టీ నేతలు నిజాలు మాట్లాడాలి.

    • భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుదిటి రాతను మార్చే శక్తి యుక్తి చంద్రబాబుకే ఉంది.

  • 2024-07-10T16:59:18+05:30

    ఆకస్మికంగా గురుకుల పాఠశాల సందర్శన

    • విశాఖ: సింహాచలం అడవివరం సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలను సందర్శించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.

    • ఆహారాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసిన గంటా శ్రీనివాసరావు.

    • గురుకులాలను ఎన్టీ రామారావు ప్రారంభించారు. ఇక్కడ విద్యార్థులకు భోజనం వసతులు బాగున్నాయి.

    • గతంలో తాము నిర్మించిన అదనపు భవనాలు ఇప్పటికీ నిర్మాణ దశలో ఉన్నాయి.

    • విద్యారంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది.

    • రేపు సీఎం చంద్రబాబు విశాఖపట్నం వస్తున్నారు. విశాఖలో గతంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం.

  • 2024-07-10T16:54:56+05:30

    రాజ్ తరుణ్‌పై కేసు నమోదు

    • రాజ్ తరుణ్‌పై లావణ్య మరోసారి ఫిర్యాదు చేసింది: రాజేంద్రనగర్ డీసీపీ

    • కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరాం

    • రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్, కొందరు బెదిరిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చింది

    • పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఫిర్యాదు చేసింది

    • రాజ్ తరుణ్ పై ఐపీసీ 493 కింద కేసు నమోదు చేశాం: డీసీపీ

  • 2024-07-10T16:48:42+05:30

    ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది: మంత్రి అచ్చెన్నాయుడు

    • గత ప్రభుత్వ హయాంలో మత్స్య శాఖ ఉందా అనే సందేహం కలుగుతుంది.

  • 2024-07-10T16:42:45+05:30

    పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ

    • గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ

    • వాదనలు వినిపిస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు

    • పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం వద్ద టీజీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పై దాడి

    • కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లి అరెస్టు

    • ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి

  • 2024-07-10T16:37:38+05:30

    కొత్త పోలీస్ బాస్

    • తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్

    • డీజీపీ హోదాలో హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న జితేందర్. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఆదనపు బాధ్యతలు

    • 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జితేందర్.

    • పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జననం, నిర్మల్, బెల్లంపల్లిలో ఏఎస్పీగా విధులు

    • 2025 సెప్టెంబరు వరకు పదవికాలం, డీజీపీగా 14 నెలలు కొనసాగే అవకాశం.

    • ప్రస్తుత డీజీపీ రవిగుప్తా హోమ్ డిపార్ట్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ

  • 2024-07-10T16:32:07+05:30

    ప్రణీత్ హనుమంతు అరెస్ట్

    • బెంగళూరులో సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతు అరెస్ట్

    • బెంగళూరు కోర్టులో ప్రణీత్‌ను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొస్తున్న పోలీసులు.

    • హనుమంతుపై కేసు నమోదు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.

    • ప్రణీత్‌తోపాటు మరో ముగ్గురుపై కేసు నమోదు

    • తండ్రి, కూతురిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రణీత్.

  • 2024-07-10T16:24:02+05:30

    టాస్ గెలిచిన భారత్

    • జింబాబ్వేతో భారత్ మూడో టీ 20

    • టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్

  • 2024-07-10T16:15:41+05:30

    సీఎం చంద్రబాబు పర్యటన

    • అనకాపల్లి జిల్లా: రేపు పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి సమీపంలో సీఎం చంద్రబాబు పర్యటన

    • ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి వంగలపూడి అనిత

    • హెలిపాడ్ పనులను, సమీపంలో పోలవరం కాలువను పరిశీలించిన హోం మంత్రి అనిత.

    • సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పలు సూచనలు

  • 2024-07-10T16:08:24+05:30

    స్మగ్లింగ్ గుట్టు రట్టు

    • ఢిల్లీ: భారత్-టిబెట్ సరిహద్దుల్లో భారీగా బంగారం తరలింపు

    • ఇద్దరి నుంచి 108.60 కేజీల బంగారు కడ్డీలు స్వాధీనం

    • తూర్పు లడాఖ్ నర్బులా టాప్ వద్ద అదుపులోకి తీసుకున్న ఐటీబీపీ

    • సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా ఆపరేషన్

    • కోయుల్, న్యోమా నివాసితులు త్సెరింగ్ చిన్బా, స్టాంజిన్ డోర్గ్యాల్‌గా గుర్తింపు

  • 2024-07-10T16:00:29+05:30

    లిక్కర్ కేసులో కీలక పరిణామం

    • ఈడీ చార్జీషీట్

    • గోవాలో ఎన్నికల ప్రచారం కోసం నిధులు

    • రూ.45 కోట్లు తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ

    • చార్జీషీట్‌లో పేర్కొన్న ఈడీ అధికారులు

  • 2024-07-10T15:52:32+05:30

    వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

    • విజయవాడ: మత్య్స శాఖ స్థితి చూస్తే చాలా బాధగా అనిపించింది

    • సాగరతీరం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్

    • గత ప్రభుత్వ హయాంలో మత్య్స శాఖ ఉందా అనేలా తయారు చేశారు

    • నాలుగు హర్బర్లలో రెండు పని చేస్తున్నాయి, రెండు పని చేయటం లేదు. హర్బర్లు ఎక్కువగా ఉంటే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుంది.

    • చంద్రబాబు పాలనలో మత్స్యకారులకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకువస్తాం

    • మత్స్యకారులకు జాతీయ మత్స్య శాఖ దినోత్సవ శుభాకాంక్షలు

  • 2024-07-10T15:44:34+05:30

    బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు

    • ముంబై: ముంబై హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం

    • స్కూటీపై వెళుతున్న దంపతులను కారుతో ఢీ కొన్న మిహిర్ షా

    • మిహిర్ షా తండ్రి రాజేశ్ షాకు చుక్కెదురు

    • శివసేన డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాజేశ్ షా తొలగింపు

  • 2024-07-10T15:38:18+05:30

    • వాడీవేడీగా కదిరి కౌన్సిల్ సమావేశం

    • అవినీతిపై చర్చకు కౌన్సిలర్ల పట్టు

  • 2024-07-10T15:33:25+05:30

    కదం తొక్కిన ఆలయ అర్చకులు

    • నిర్మల్: బాసరలో బీజాక్షరాల వ్యవహారంపై జ్ఞాన సరస్వతీ దేవి అనుష్టాన పరిషత్ ఆందోళన

    • చిన్నారుల నాలికలపై బీజాక్షరాలు రాస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ర్యాలీ

    • ప్రైవేట్ వ్యక్తుల గోదావరి హారతిని నిలిపి వేయాలని ఆలయ ఈవోకు వినతి పత్రం

    • అమ్మవారి ఆలయం ఆధ్వర్యంలో గోదావరి హారతి నిర్వహించాలని అర్చకుల డిమాండ్

  • 2024-07-10T15:27:29+05:30

    బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత

    • అనంతపురం: టీడీపీ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది: బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత

    • 2014 నుంచి 19 వరకు బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం జరిగింది

    • ప్రభుత్వ వసతి గృహాలు అధ్వాన్నస్థితికి చేరాయి. వచ్చే ఏడాది స్కూల్స్, క్లాస్ రూమ్స్ పెంచుతాం

    • జగన్ నా బీసీలు అని చెప్పి మోసం చేసి.. బీసీల ద్రోహిగా మారారు. బడుగు, బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది.

    • గత ప్రభుత్వంలో ఇసుక సమస్యతో సమాధులు కూడా కట్టలేకపోయారు. కొత్త పాలసీతో పేదలకు ఇసుక అందుబాటులో ఉంటుంది

    • కరవు జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం

  • 2024-07-10T15:19:21+05:30

    ఫోన్ ట్యాపింగ్ కేసుపై హై కోర్టు

    • ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో మీడియా సంయమనం పాటించాలి - హైకోర్టు

    • వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి రాద్దాంతం చేయొద్దు: హైకోర్టు

    • జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్‌ నెంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దు: హైకోర్టు

    • ఈ నెల 23వ తేదీన కౌంటర్‌ దాఖలు చేస్తాం: కేంద్రం

  • 2024-07-10T15:13:12+05:30

    రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కామెంట్స్

    • తూ.గో జిల్లా: పొగాకు అధికంగా పండించే బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పంట దెబ్బతింది.

    • దేశంలో పొగాకు మంచి డిమాండ్ ఏర్పడింది: రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

    • పరిమితి మించి పండించిన పొగాకుకు పెనాల్టీ లేకుండా చేయాలని కేంద్రమంత్రిని కోరాం.

    • కేంద్రం నుంచి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం.

    • ముడి పొగాకు ఎగుమతి చేసే దేశంగా భారత్‌కు మంచి గుర్తింపు ఉంది.

    • దేశంలో సిగరెట్ల తయారీ పరిశ్రమ 9 శాతం మాత్రమే ఉంది.

  • 2024-07-10T15:05:46+05:30

    ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్

    • తూ.గో జిల్లా: దేశంలో అత్యధికంగా పండించే రెండో పంట పొగాకు: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్

    • పొగాకును రైతులు బంగారంలా భావించి పండిస్తారు.

    • రైతు సమస్యలు తీర్చేందుకు ముందుంటాం: పుట్టా మహేశ్ యాదవ్

  • 2024-07-10T15:01:25+05:30

    సీఎం చంద్రబాబు సంతాపం

    • అమరావతి: విద్యావేత్త, వెంకటేశ్వర వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వి.జయసింహులు నాయుడు మృతి

    • ప్రొఫెసర్ జయసింహులు నాయుడు మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

    • ప్రొఫెసర్ జయసింహులు సహచర విద్యార్థి, స్నేహితుడు

    • వేలాదిమందిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంతోపాటు తన రచనల ద్వారా ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచారు

    • జయసింహులు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను

    • జయసింహులు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం చంద్రబాబు

  • 2024-07-10T14:56:56+05:30

    ఏపీ మంత్రి బ్లాక్

    • ఏపీ మంత్రిని బ్లాక్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

  • 2024-07-10T14:54:02+05:30

    పిడుగురాళ్లలో డయేరియా కేసులు

    • పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల లెనిన్ నగర్‌లో డయేరియా కలకలం.

    • జిల్లా కలెక్టర్‌తో కలసి డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే యరపతినేని పర్యటన

    • డయేరియా అదపులోకి వచ్చే వరకు గురజాల ఆర్డీఓ పిడుగురాళ్లలో ఉండాలని ఆదేశాలు

  • 2024-07-10T13:59:06+05:30

    టీటీడీ అధికారులు కీలక నిర్ణయం.. ఇక నుంచి..

    • తిరుమల అన్నదానంలో నాణ్యమైన ఆహార పదార్ధాలను భక్తులకు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం: టీటీడీ ఈవో శ్యామలరావు

    • దేశంలో ప్రసిద్ధ గాంచిన నిపుణల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించాం.

    • నిపుణులు సూచనల మేరకు అన్నదానంలో పలు మార్పులతో పాటు ఆధునికరణ చెయ్యాల్సిన అవసరం వుంది.

    • అన్నదానంలో సిబ్బంది కొరత వుంది.. త్వరలోనే నూతనంగా సిబ్బందిని నియమిస్తాం.

    • అన్నదానంలో వడ్డించే అన్నంపై పలు సార్లు భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.

    • టెక్నాలజీని వినియోగించుకొని అన్నదానంలో మార్పులకు శ్రీకారం చుట్టాం.

    • కిచెన్‌లోని యంత్రాలు పాత బడ్డాయి.. వాటిని మార్చాల్సి వుంది.

    • త్వరలోనే అన్నదానంలో పూర్తి స్థాయిలో మార్పులు చేస్తాం.

  • 2024-07-10T13:47:09+05:30

    ఆ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్.. ఏపీ మంత్రిని బ్లాక్ చేసిన కేటీఆర్..

    • ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణా మాజీ మంత్రి @KTRBRS చిలక పలుకులు పలుకుతున్నారు.

    • ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూభకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను కూడా కబళించాడు.

    • గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే.

    • ఫాంహౌస్ కు పరిమితమైన మీరు X లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు.

    • మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్ లో 4 సం క్రితం నన్ను బ్లాక్ చేశారు.

    • ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియ మిత్రులు జగన్ కేతిరెడ్డిలను ఓడించాయి.

    • ఒకే జాతి పక్షులు ఒకరికొకరు ‘సర్టిఫికేట్’ లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి.

  • 2024-07-10T13:47:04+05:30

    గుంటూరు: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్

    • బెయిల్ పిటిషన్ పై మరికొద్దిసేపట్లో కోర్టులో ప్రారంభంకానున్న వాదనలు

    • రెండు సార్లు వాదనలకు హాజరుకాని ప్రాసిక్యూషన్ న్యాయవాదులు.

    • రెండు సార్లు వాయిదా వేసిన న్యాయమూర్తి.

    • ఈరోజు గుంటూరులో బెయిల్ పిటిషన్ పై జరగనున్న వాదనలు

    • నిన్నటితో ముగిసిన పిన్నెల్లి పోలీస్ కస్టడీ.

  • 2024-07-10T13:33:47+05:30

    హైదరాబాద్ : సీజనల్ వ్యాధులపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష.

    • ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టిన అధ్యక్షతన సమావేశం.

    • హాజరైన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, అడిషనల్ కమిషనర్ రవికిరణ్, అధికారులు.

    • హెల్త్ సమీక్షలో అధికారులపై మేయర్ విజయలక్ష్మీ సీరియస్.

    • క్షేత్రస్థాయిలో ఏఎంహెచ్ఓ లు పని చేయడం లేదు.

    • మీ వల్ల జీహెచ్ఎంసీకి, నగరానికి చెడ్డ పేరు వస్తోంది.

    • అధికారుల పై ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.

    • చెత్త ఎక్కడపడితే అక్కడే కనిపిస్తోంది.

    • అధికారుల్ని ట్రాన్స్ ఫర్ చేసిన ఏం ఉపయోగం ఉండదు.

    • ఇకపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.

  • 2024-07-10T13:29:52+05:30

    తెలంగాణ సచివాలయం ముందు ధర్నాకు యత్నించిన విద్యార్థుల రాజకీయ పార్టీ(తెలంగాణ రాష్ట్రం)

    • వీఆర్పీ రాష్ట్ర కన్వీనర్ కమలాకర్ నేతృత్వంలోఆందోళన.

    • సచివాలయం గేట్ వద్దనే ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు.

    • ఆందోళనకారులను నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలింపు.

    • నిరుద్యోగుల టీజీపీఎస్సీ ముట్టడిని సమర్థించిన విఆర్‌పి.

    • గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్లు పెంచాలి.

    • డీఎస్సీని వాయిదా వేసి 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలి.

    • యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించిన 4000 నిరుద్యోగ భృతిని అందజేయాలి.

    • జీవో నెంబర్‌ 46ను వెంటనే రద్దు చేయాలి.

    • బాధితులను సూపర్ న్యూమరి పోస్టులతో భర్తీ చేయాలి.

    • వెంటనే రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్‌ ప్రకటించాలి.

  • 2024-07-10T13:22:15+05:30

    ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష..

    • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ.

    • రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా.

    • ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా రూ. 14 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారుల ప్రాథమిక అంచనా.

    • పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై సమీక్షించనున్న సీఎం.

    • పెండింగ్ బిల్లుల వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారీ వివరాలు కోరిన ఆర్థిక శాఖ.

    • రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు.. కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై ఫోకస్.

    • పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదన.

    • ఓటాన్ అకౌంట్ పెట్టే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం.

    • ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేత పత్రంపై చంద్రబాబు కసరత్తు.

  • 2024-07-10T12:59:33+05:30

    రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త ట్విస్ట్

    • రాజ్ తరుణ్ అబార్షన్ చేయించడాని నార్సింగ్ పీఎస్‌లో మరో ఫిర్యాదు

    • పదేళ్లుగా తనతో కాపురం చేస్తున్నాడు

    • నన్ను రెచ్చగొట్టి ఉద్దేశ పూర్వకంగా నా ఆడియోలు రికార్డ్ చేశాడు

    • మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసున్నాడు

    • 170 ఫోటోలు, టెక్నీకల్ ఏవిడెన్స్‌ను నార్సింగ్ పోలీసులకు అప్పగించిన లావణ్య

    • రాజ్ తరుణ్‌పై ipc 493 తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు.

  • 2024-07-10T12:57:00+05:30

    సివిల్ సప్లయిస్‌లో భారీ గోల్ మాల్..

    • సివిల్ సప్లయిస్‌లో భారీ గోల్ మాల్ జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు.

    • మిల్లర్ల నుంచి సివిల్ సప్లయిస్ గోడౌన్ కు బియ్యం చేరేటప్పుడు భారీ స్కాం జరుగుతుంది.

    • ఒక్కొ బస్తాకు రెండు నుంచి ఐదు కిలోలు వరకు వ్యత్యాసం ఉన్నట్లు తెలిసింది.

    • ఈ దోపిడికి సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు క్షేత్రస్తాయిలో పర్యటించడం జరుగుతోంది.

    • ఈ పర్యటనల్లో చాలా చోట్ల అక్రమాలు జరుగుతున్నట్లు తెలిసింది.

    • మిల్లర్ల నుంచి తక్కువ తూకంతో బస్తాలు వస్తే సివిల్ సప్లయిస్ గోడౌన్ అదికారులు తీసుకొవద్దు.

    • ఎవరో అక్రమాలకు పాల్పడితే అధికారులు ఎందుకు అంటించుకుంటారు.

    • పులివెందులలో భారీ స్కీల్ డెవలప్‌మెంట్ భవనాలు నిర్మించారు. కానీ వాటిని వినియోగించుకోలేకపోయారు.

    • తప్పక వాటిని వాడుకుని శిక్షణా నైపుణ్యానాన్ని అభివృద్ది చేస్తాం.

  • 2024-07-10T12:54:36+05:30

    టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణ వాయిదా..

    • టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల పిటిషన్లపై విచారణ వాయిదా.

    • వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.

    • ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్.

  • 2024-07-10T12:52:10+05:30

    ప్రజలు ఛీ కొట్టినా హత్యా రాజకీయాలను వీడని వైసీపీ: పల్లా శ్రీనివాస్

    • వైసీపీ అరాచకాలపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు.

    • ప్రజలు ఛీ కొట్టినా హత్యా రాజకీయాలను వీడని వైసీపీ.

    • అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్త ఆదెప్పను పొట్టన పెట్టుకున్న వైసీపీ గూండాలు.

    • కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా హత్య.

    • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా 9 మందిని పొట్టన పెట్టుకున్న వైసీపీ గూండాలు.

    • ఆదెప్ప కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.

  • 2024-07-10T12:46:06+05:30

    Latest News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమేు ప్రత్యేకంగా లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఇక్కడే చూసేయండి.

  • 2024-07-10T08:45:26+05:30

    మరోసారి నితీశ్ కుమార్ ఇలా..!!

    • స్టేజీపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ వింత ప్రవర్తన

    • జేపీ గంగా మార్గ్ పొడగింపు పనులపై అసంతృప్తి

    • వేగంగా పూర్తి చేయాలని కంపెనీ ప్రతినిధికి చేతులు జోడించి విజ్ఞప్తి.. ఆ వెంటనే కాళ్లు పట్టుకుంటా అని కోరిన నితీశ్

    • అలా చేయొద్దని కోరిన కంపెనీ ప్రతినిధి, ఆశ్చర్యపోయిన స్టేజీ మీద ఉన్న నేతలు, అధికారులు

    • గతంలో ప్రధాని మోదీ కాళ్లు పట్టుకోబోయిన నితీశ్ కుమార్, వారించిన మోదీ

  • 2024-07-10T01:36:07+05:30

    మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ సంచలన లేఖ..

    • మంచిర్యాల: మాజీ మావోయిస్టు హుస్సేన్ అరెస్టు‌ను ఖండించిన మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్.

    • సాధారణ జీవితం గడుపుతున్న 73ఏళ్ల హుస్సేన్ పై పోలీసులు కట్టు కథ అల్లారు.

    • జమ్మి కుంటలో కిడ్నాప్ చేసి రామకృష్ణపూర్‌లో పట్టుకున్నట్టు ప్రకటించడం సిగ్గు చేటు.

    • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా ఉద్యమకారులను, విప్లవ కారులను అణచివేస్తున్నాయి.

    • సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళి వచ్చినప్పటి నుంచి నిర్భంధం పెరుగుతోంది.

    • ఇక్కడి వనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    • విద్యుత్, బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేయబోతున్నారు.

    • నిరుద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది.

  • 2024-07-10T01:19:33+05:30

    కర్నూలు: బాలిక హత్య దారుణం: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

    • ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం గాలింపును పర్యవేక్షించిన మాజీ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

    • రౌడీలు పెట్రరేగిపోయి ఇలాంటి సంఘటనలు జరిగుతున్నాయి.

    • గంజాయి పిల్లలకు కూడా చేరుతోంది.

    • ముచ్చుమర్రిలో ఐదేళ్ల క్రితం క్రమశిక్షణ, కట్టుబాట్లతో ఉండేది.

    • బాలిక హత్య దారుణం, నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలి.