Share News

BRS Vs Congress: రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విసుర్లు

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:42 PM

రేవంత్ ప్రభుత్వం ప్రకటనల పేరుతో ప్రజా ధనాన్ని ఎందుకు వృథా చేస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ (KP Vivekananda Goud) ప్రశ్నించారు. ఒకే సారి 2లక్షలు రుణ మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పినందుకు కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుందా అని నిలదీశారు.

BRS Vs Congress: రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విసుర్లు

హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వం ప్రకటనల పేరుతో ప్రజా ధనాన్ని ఎందుకు వృథా చేస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ (KP Vivekananda Goud) ప్రశ్నించారు. ఒకే సారి 2లక్షలు రుణ మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పినందుకు కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుందా అని నిలదీశారు. దేవుడి మీద ఒట్టేసి కూడా మాట తప్పుతున్నారని మండిపడ్డారు. ఈరోజు( శుక్రవారం) తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మీడియాతో మాట్లాడుతూ... రుణమాఫీ చేసి ఎందుకు ఆర్భాటాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.


ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి...

ఎవరి జాగీరని గతంలో తమను ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరి జాగీరని ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా రేవంత‌రెడ్డిని నిద్రపోనివ్వమని అన్నారు. బౌరంపేటలో 600మంది రైతులున్న ఓ సొసైటీలో కేవలం 11మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని.. దీనికే సంబరాలు చేసుకోవాలా? అని నిలదీశారు. లక్షలోపు ఇంత మందికి ఎగ్గొడితే మరి రెండు లక్షల్లో ఎంతమందికి ఎగ్గొడతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి ఉండి ఇంకా కేసీఆర్‌పై ఏడుస్తున్నారని.. అలా చేయొద్దని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ హితవు పలికారు.


రైతు భరోసా ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు: కోవా లక్ష్మి

kova-laxmi-revanth.jpg

రైతు భరోసా ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి (Kova Laxmi) ప్రశ్నించారు. రైతులను అడిగి రైతు భరోసా ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శలు చేశారు. ఈరోజు( శుక్రవారం) తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే కోవా లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ... ఐదు ఎకరాలకు మాత్రమే ఇవ్వాలని కాంగ్రెస్ నేతలతో మాట్లడిస్తున్నారని చెప్పారు. రూ. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని కోవాలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 19 , 2024 | 04:58 PM