Share News

CM Revanth:ర‌క్షణ శాఖ భూమలు కేటాయించాలి

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:47 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు (మంగళవారం) ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీలో సీఎం బిజీ బిజీగా ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులను, ఏఐసీసీ అగ్రనేతలను ముఖ్యమంత్రి కలవనున్నారు. రాష్ట్ర సమస్యలను కేంద్రమంత్రుల దగ్గరికి సీఎం తీసుకెళ్లనున్నారు.

CM Revanth:ర‌క్షణ శాఖ భూమలు కేటాయించాలి
CM Revanth Reddy

ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు (మంగళవారం) ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీలో సీఎం బిజీ బిజీగా ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులను, ఏఐసీసీ అగ్రనేతలను ముఖ్యమంత్రి కలవనున్నారు. రాష్ట్ర సమస్యలను కేంద్రమంత్రుల దగ్గరికి సీఎం తీసుకెళ్లనున్నారు. ఇందులో భాగంగానే మధ్యాహ్నం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు.


రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీల భేటీ ముగిసింది. డిఫెన్స్ భూములు, వరంగల్లో సైనిక్ స్కూల్ ఏర్పాటు ఇతర అంశాల గురించి రాజ్‌నాథ్ సింగ్‌కి విజ్ఞప్తి చేశారు. ర‌క్షణ భూముల బ‌ద‌లాయింపుపై రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ విజ్ఞాపనలు ఇచ్చారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ర‌హ‌దారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ర‌క్షణ శాఖ ప‌రిధిలో ఉన్న భూములు కేటాయించాల‌ని రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం కోరారు. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ర‌ద్దీని నివారించేందుకు మెహిదీప‌ట్నం రైతు బ‌జార్ వ‌ద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామ‌ని, ఇందుకోసం అక్కడ ఉన్న ర‌క్షణ శాఖ భూమి 0.21 హెక్టార్లను బ‌దిలీ చేయాల‌ని కేంద్రమంత్రిని సీఎం కోరారు. రాష్ట్రంలో స్కై వేల నిర్మాణం, రక్షణ శాఖ భూముల బదలాయింపులపై రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ చర్చించారు.

Updated Date - Jun 24 , 2024 | 05:36 PM