Share News

Bhatti Vikramarka: రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం

ABN , Publish Date - Jun 25 , 2024 | 06:38 PM

రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో ఈరోజు(మంగళవారం) వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.

Bhatti Vikramarka: రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం
Mallu Bhatti Vikramarka

హైదరాబాద్: రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో ఈరోజు(మంగళవారం) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌలి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు మరియు తదితరులు హాజరయ్యారు. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. అనంతరం మీడియాతో ఈ సమీక్షలో చర్చించిన విషయాలను మీడియాకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిలిపివేసిన వ్యవసాయ పథకాలు ఏంటి.. అందుకు గల కారణాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంటల భీమాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు. రాబోయే సీజన్‌కు పంటల భీమాకు సంబంధించి పిలవాల్సిన టెండర్లపై చర్చించారు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో ఉన్న వ్యవసాయ కళాశాలలు, ఇప్పటికీ కళాశాలలు లేని జిల్లాల వివరాలను డిప్యూటీ సీఎం సమావేశంలో తీసుకున్నారు.


MALLU-4.jpg

సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలపై ఆరా తీశారు. వ్యవసాయ కళాశాలలో విత్తన అభివృద్ధి తీరుపై చర్చించారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం.. అయితే వ్యవసాయం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే ఉత్పత్తుల పెరిగి రాష్ట్ర ఖజానాకు , రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం సమకూర్చే రంగాలు.. ప్రభుత్వం తదితర రంగాలపై చేస్తున్న ఖర్చులను డిప్యూటీ సీఎం అధికారుల ద్వారా విచారించారు. ఇక రైతు భరోసాకు సంబంధించి రైతుల అభిప్రాయం ఎలా ఉంది, ఏ విధంగా ముందుకు పోతే మంచిదనే విషయాలను రైతుల ద్వారానే తెలుసుకుంటే మంచిదని .. రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేసి రైతులను భాగస్వాములను చేయాలని, అందులో మంత్రులు కూడా పాల్గొంటే కార్యక్రమం మరింత ప్రయోజనాత్మకంగా ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు.


BHATTI-5.jpg

డ్రిప్ ఇరిగేషన్‌కు నిధులు కేటాయిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు అభిప్రాయం వ్యక్తపరిచారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా పథకాలకు ఇప్పటివరకు చేస్తున్న ఖర్చు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రాబోయే రోజుల్లో పెరుగుతున్న బడ్జెట్‌పై సమీక్ష చేశారు. ఆయిల్ ఫామ్ సాగులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై చర్చించారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న నేతన్న చేయూత, నేతన్న భీమా పథకాలు ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన తర్వాత చేనేత కార్మికుల జీవితాల్లో వచ్చిన మార్పులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను విచారించారు. సిరిసిల్ల కో-ఆపరేటివ్ సొసైటీ, టెక్స్ టైల్ వ్యాపారస్తులు ప్రభుత్వం నుంచి ఏ పద్ధతిలో ప్రయోజనం పొందుతున్నారు తదితర వివరాలను అధికారులు సమావేశంలో వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో మ్యాచింగ్ ద్వారా వచ్చే పథకాలు, నిధులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు తెలిపారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు, ఆర్థిక శాఖ అడిషనల్ సెక్రెటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2024 | 06:38 PM