Share News

Kodanda Reddy: రైతు రుణమాఫీ‌పై హరీష్‌రావు చర్చకు రావాలి

ABN , Publish Date - Aug 19 , 2024 | 02:06 PM

రైతు రుణమాఫీ గురించి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఎక్కడికి వస్తారో రండి.. చర్చ పెడదామని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి అన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏంటని ప్రశ్నించారు. ఎనిమిది నెలల్లో రేవంత్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏంటో డేటా తీసుకువస్తామని సవాల్ విసిరారు.

Kodanda Reddy:  రైతు రుణమాఫీ‌పై హరీష్‌రావు చర్చకు రావాలి
Kodanda Reddy

హైదరాబాద్: రైతు రుణమాఫీ గురించి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఎక్కడికి వస్తారో రండి.. చర్చ పెడదామని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి అన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏంటని ప్రశ్నించారు. ఎనిమిది నెలల్లో రేవంత్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏంటో డేటా తీసుకువస్తామని సవాల్ విసిరారు. 2018-24 వరకు వ్యవసాయేతర భూములకు రైతుబంధు రూ.25,676 కోట్లు ఇచ్చారని.. అందులో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు మళ్లాయని కోదండ రెడ్డి ఆరోపణలు చేశారు.


సోమవారం నాడు గాంధీభవన్‌లో కోదండరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఔటర్ రింగ్ రోడ్డుకు భూమి కోల్పోతే.. నష్టపరిహారం అప్పుడు వచ్చిందని అన్నారు. మొన్నటి వరకు కూడా రైతు బంధు వచ్చిందని చెప్పా రు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి నాలుగు గోడల మధ్య కుర్చీని నిర్ణయాలను రేవంత్ ప్రభుత్వం తీసుకోదని స్పష్టం చేశారు. రైతులకు రూ.2లక్షల కన్న ఎక్కువ రుణం ఉంటే.. పైన ఉన్న మొత్తం చెల్లిస్తే.. రూ.2 లక్షల వరకు ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుందని కోదండ రెడ్డి స్పష్టం చేశారు.


రైతాంగాన్ని అనవసరంగా కన్ఫ్యూజన్ చేయొద్దని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కోలుకొని విధంగా కేసీఆర్ పాలనలో రైతులు అప్పుల పాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్‌రావు దగ్గర వాస్తవంగా రుణమాఫీ కానీ రైతుల జాబితా ఉంటే ప్రభుత్వానికి పంపించాలని సవాల్ విసిరారు. హరీష్ గాలి మాటలు మాట్లాడవద్దని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణితో చేసిన తప్పులు ROR చట్టం అమలుతో బయటపడతాయని కోదండరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Aug 19 , 2024 | 02:07 PM