Share News

Raghunandan Rao : రాజకీయాలు బంద్ చేసి.. ఆ పని చేయ్.. కేటీఆర్‌పై ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు

ABN , Publish Date - Nov 01 , 2024 | 07:18 PM

కాంగ్రెస్ పది నెలల పాలనే విసుగొస్తే బీఆర్ఎస్ పాలనను ప్రజలు ఎలా భరించారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసిన ప్రజలు విశ్వసించరని విమర్శించారు. కేటీఆర్‌కు తన నాన్న, చెల్లె, బావతో పాటు ఎవరిపై నమ్మకం లేదని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు.

Raghunandan Rao : రాజకీయాలు బంద్ చేసి..  ఆ పని చేయ్.. కేటీఆర్‌పై ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు

సంగారెడ్డి జిల్లా: మాజీ మంత్రి కేటీఆర్‌పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు గుప్పించారు. ఇవాళ(శుక్రవారం) సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనకు రాజకీయాలు బంద్ చేయాలని ఉందని కేటీఆర్ అన్నారని.. బంద్ చేయ్ ఎవరు వద్దు అనలేదు కదా అని ప్రశ్నించారు. కేటీఆర్.. అమెరికా వెళ్లి బాత్ రూంలు కడుక్కోవాలని ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు గుప్పించారు.


అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్‌కు ప్రజలను కలిసే సమయం దొరకలేదా అని ప్రశ్నించారు. ‘‘మీ నాన్న 10 నెలలుగా ఫామ్‌హౌస్‌లో ఉన్నారు..ఏమైనా నష్టం జరిగిందా’’ అని నిలదీశారు. కేటీఆర్ వచ్చింది ప్రజల కోసం కాదని.. ఆయన వచ్చింది డబ్బులు, అధికారం కోసం, ఫామ్‌హౌస్ కోసమని ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేశారు.


కేటీఆర్‌కు కాంగ్రెస్ పది నెలల పాలనే విసుగొస్తే.. బీఆర్ఎస్ పాలనను ప్రజలు ఎలా భరించారని నిలదీశారు. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసిన ప్రజలు విశ్వసించరని విమర్శించారు. కేటీఆర్‌కు తన నాన్న, చెల్లె, బావతో పాటు ఎవరిపై నమ్మకం లేదని ఆరోపించారు. ఫామ్‌హౌస్ కేసులో పాలేవో.. నీళ్లేవో తేలాలంటే సీసీ ఫుటేజ్ బయట పెట్టాల్సిందేనని అన్నారు. తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని కోరుట్ల ఎమ్మెల్యే అంటున్నారని.. తెలంగాణలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా అని నిలదీశారు. దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన కుక్క తోక పటాకులు కూడా పేలలేదని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Minister Seethakka:బీఆర్ఎస్ హయాంలో విద్య వ్యవస్థ నాశనమైంది.. మంత్రి సీతక్క విసుర్లు

Multipurpose Park: కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్..

Harirama jogaiah: మరో లేఖతో ముందుకొచ్చిన హరిరామజోగయ్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 01 , 2024 | 07:48 PM