College: కాలేజీలో సిగరెట్ తాగుతున్న ఇంటర్ కుర్రాడు.. చాటుగా వీడియో తీసిన మరో విద్యార్థి.. చివరకు ఓ ప్రాణమే పోయింది..!

ABN , First Publish Date - 2023-07-30T17:31:39+05:30 IST

బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాల్సిన విద్యార్థులు కొందరు.. చెడు అలవాట్లకు బానిసలై జీవితాలను సర్వనాశనం చేసుకుంటుంటారు. ఇంకొందరు డ్రగ్స్‌కు బానిసలై చివరకు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడడం కూడా రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా..

College: కాలేజీలో సిగరెట్ తాగుతున్న ఇంటర్ కుర్రాడు.. చాటుగా వీడియో తీసిన మరో విద్యార్థి.. చివరకు ఓ ప్రాణమే పోయింది..!

బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాల్సిన విద్యార్థులు కొందరు.. చెడు అలవాట్లకు బానిసలై జీవితాలను సర్వనాశనం చేసుకుంటుంటారు. ఇంకొందరు డ్రగ్స్‌కు బానిసలై చివరకు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడడం కూడా రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థి కళాశాలలోనే సిగరెట్ తాగుతుండడం చూసి మరో విద్యార్థి చాటుగా వీడియో తీశాడు. ఈ ఘటన కారణంగా చివరకు ఓ ప్రాణమే పోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్‌లోని తుకోగంజ్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న స్వామి వివేకానంద ప్రభుత్వ కళాశాలలో కొందరు విద్యార్థుల మధ్య ఘర్షణ (Conflict between students) జరిగింది. 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. తరచూ కళాశాలలోనే సిగరెట్ తాగుతూ ఉండేవాడు. ఓ రోజు ఇతను సిగరెట్ తాగుతూ (student smoking a cigarette) ఉండడాన్ని.. 12వ తరగతి చదువుతున్న సమర్థ్ అనే విద్యార్థి చూశాడు. వెంటనే ఈ ఘటనను వీడియో తీశాడు. అనంతరం అధ్యాపకులకూ ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై చర్యలు తీసుకోవడంలో అధ్యాపకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

Viral Video: వీరంతా గుంపులుగా వచ్చింది జాతర కోసం అనుకుంటే పొరపాటే.. ఈ మహిళల ఆరాటం దేనికో తెలిస్తే నోరెళ్లబెడతారు..

ఇదిలావుండగా, తాను సిగరెట్ తాగుతున్న సమయంలో వీడియో తీయడమే కాకుండా, ఉపాధ్యాయులకు చేయడంపై నిందితుడు సమర్థ్‌పై పగ పెంచుకున్నాడు. ఇటీవల ఓ రోజు సమర్థ్ ఒంటరిగా దొరకడంతో నిందితుడు (Assault on student) అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సమర్థ్.. తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చుట్టు పక్కల వారు అతన్ని చికిత్సం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతితో స్థానికంగా తీవ్ర ఉద్రిక వాతావరణం నెలకొంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Viral Video: మీరు రోజూ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా.. అయితే ఈ డెలివరీ బాయ్ చేసిన పని చూస్తే షాకవుతారు..

Updated Date - 2023-07-30T17:31:39+05:30 IST