Viral Video: వీరంతా గుంపులుగా వచ్చింది జాతర కోసం అనుకుంటే పొరపాటే.. ఈ మహిళల ఆరాటం దేనికో తెలిస్తే నోరెళ్లబెడతారు..

ABN , First Publish Date - 2023-07-30T15:14:29+05:30 IST

ప్రముఖ దేవాలయాల వద్ద దర్శన సమయాల్లో, ఏదైనా పెద్ద పెద్ద జాతర జరుగుతున్న ప్రదేశాల్లో.. భక్తుల తొక్కిసలాట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నిసార్లు చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు.. కిక్కిరిసిన జనం మధ్య ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలా చూశాం. ఇలాంటి..

Viral Video: వీరంతా గుంపులుగా వచ్చింది జాతర కోసం అనుకుంటే పొరపాటే.. ఈ మహిళల ఆరాటం దేనికో తెలిస్తే నోరెళ్లబెడతారు..

ప్రముఖ దేవాలయాల వద్ద దర్శన సమయాల్లో, ఏదైనా పెద్ద పెద్ద జాతర జరుగుతున్న ప్రదేశాల్లో.. భక్తుల తొక్కిసలాట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నిసార్లు చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు.. కిక్కిరిసిన జనం మధ్య ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు.. నెట్టింట రోజూ చూస్తూనే ఉంటాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎలంటి జాతర లేకపోయినా.. గుంపులు గుంపులుగా ఉన్న మహిళల మధ్య ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ వీడియో చూసిన వారంతా.. పది నిముషాలు ఆలస్యం అవుతుందని.. ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అవసరమా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ముంబై రైల్వే స్టేషన్‌లో (Mumbai Railway Station) ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి లోకల్ ట్రైన్లలో (Local train) నిత్యం ఎంత రద్దీ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. గుంపులు గుంపులుగా వచ్చిన మహిళలంతా (women) లోకల్ ట్రైన్ కోసం వేచి చూస్తూ ఉన్నారు. అప్పటికే ఇసుకేస్తే రాలనంతగా ఉండగా.. రైలు వచ్చే సమయానికి మరింత వచ్చి చేరారు. వీరిని చూసి అక్కడేమైనా జాతర జరుగుతోందా అని అనిపిస్తుంది. ఇక రైలు రాగానే ఒక్కసారిగా ఒకరినొకరు తోసుకుంటూ తోక్కుకుంటూ రైలు ఎక్కడం చూసి అంతా మరింత షాక్ అయ్యారు.

Viral Video: మీరు రోజూ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా.. అయితే ఈ డెలివరీ బాయ్ చేసిన పని చూస్తే షాకవుతారు..

ఈ తోపులాటలో కొందరు మహిళలు కింద పడిపోయారు. అయినా ఎవరూ పట్టించుకోకుండా బోగీలోకి ఎక్కేశారు. ఈ క్రమంలో ఏమాత్రం పట్టుతప్పినా ప్లాట్‌ఫామ్, రైలు మధ్య సందులోకి పడిపోయే ప్రమాదం ఉంది. కానీ వారిలో ఎక్కడా ఆ భయం ఇసుమంత కూడా కనిపించలేదు. ఈ ఘటనను చూసి అవాక్కైన కొందరు.. వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పది నిముషాలు ఆలస్యం అవుతుందని.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు’’.. అంటూ కొందరు, ‘‘పొట్టకూటి కోసం ఎన్ని తిప్పలో’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి దృశ్యాలు మేమెప్పుడూ చూల్లేదు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అప్పటిదాకా కేవలం కుక్కలే కదా అనుకున్నాడు.. ఒకే ఒక్క ఘటనతో వాటి ఉపయోగం తెలిసొచ్చింది.. నిమిషం ఆలస్యం అయ్యున్నా..

Updated Date - 2023-07-30T15:14:29+05:30 IST